మగతనంపై మాట్లాడిన పవన్‌‌కు జగన్ స్ట్రాంగ్ పంచ్!

0
452

వైసీపీ అధినేత వైఎస్‌‌ జగన్ మోహన్‌‌రెడ్డి.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు- ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతి విమర్శలతో అటు పవన్ బహిరంగ సభలు.. ఇటు జగన్ పాదయాత్ర సభలు హోరెత్తుతున్నాయి. ఇటీవల జగన్‌‌పై జరిగిన హత్యాయత్నం, ప్రజా సంకల్పయాత్రపై పవన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలను జగన్ పెద్దగా పట్టించుకోలేదు. మరోసారి అసెంబ్లీకి వెళ్లకుండా రోడ్లపై తిరగడమేంటి..? శాసనసభకు వెళ్లి మగతనమేంటో నిరూపించుకోవాలంటూ పవన్ పెద్దపెద్ద మాటలే మాట్లాడారు. దీంతో కాసింత ఆగ్రహానికి లోనైన వైఎస్ జగన్ శ్రీకాకుళం రాజాం పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ సినిమా డైలాగ్‌‌లకు స్ట్రాంగ్ పంచ్ ఇచ్చారు.

 

జగన్ మాటల్లోనే…

“నాలుగేళ్ల‌కోసారి భార్య‌ల‌ను మార్చ‌డం మ‌గ‌త‌న‌మా?. పవన్‌ 2014 నుంచి 2018 వరుకు నాలుగున్నరేళ్ల వరకు చంద్రబాబుతో కలిసి కాపురం చేస్తాడు. చంద్రబాబు చెప్పిన ప్రతి అబద్ధంతోనూ,చేసిన ప్రతి మోసంలోనూ, చేసిన అవినీతిలోనూ భాగస్వామి కాదా..? తెర ముందు దోస్తీ, ఎన్నికలు ఆరునెలలు ముందు చంద్రబాబుతో పవన్‌ విడిపోయినట్లుగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసి లాలూచీ చేస్తాడు. నేడు నిజంగా చంద్రబాబు విలువలు, విశ్వసనీయతలేని రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చంద్రబాబు స్క్రిప్టు రాసి డైరెక్షన్‌ చేస్తాడు. యాక్షన్‌ మాత్రం పవన్‌కల్యాణ్‌‌దే. అదే సినిమాకు నిర్మాత లింగమనేని. పవన్‌ సినిమాకు ఇంటర్వెల్‌ ఎక్కువ సినిమా తక్కువ. చంద్రబాబు ఎప్పుడు డబ్బులిస్తే అప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా కాల్షిట్లు ఇస్తుంటాడు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నా.. నేడు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో.. ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆయన అధర్మం మీద పోరాటం చేస్తున్నాం. అన్యాయంపై,అవినీతిపై పోరాటం చేస్తున్నాం. నాలుగున్నర సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏమి జరిగిన కూడా అక్కడ కనిపించే వ్యక్తి ఎవరైనా ఉంటే అది జగన్‌ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు” అని జగన్ చెప్పుకొచ్చారు.

 

నలుగుర్ని పెళ్లి చేసుకోవడం మగతనమా..!?

“పవన్‌ అనే వ్యక్తి చంద్రబాబు పరిపాలనలో ఆయన పార్ట్‌నర్‌గా ఉంటూ ఆయన చేసిన మోసం, అవినీతిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు పాలన మీద తక్కువ మాట్లాడతాడు. జగన్‌ అవినీతిపరుడు అంటాడు. జగన్‌ అవినీతి పరుడు అని నువ్వు చూశావా?. దివంగత నేత వైఎస్‌ఆర్‌ పాలన గురించి నీకేం తెలుసు?. వైఎస్‌ఆర్‌ పాలన చూడలేదు.. అప్పుడంతా సినిమాలో ఉన్నాడు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు అవినీతి గురించి పక్కన పెట్టి గత వైఎస్‌ఆర్‌ పాలన గురించి మాట్లాడతాడు. ఈ మధ్యకాలంలో మగతనం గురించి మాట్లాడుతున్నాడు. నలుగురు భార్యలను పెళ్ళి చేసుకుంటాడు. నాలుగేళ్లకోసారి భార్యలను మార్చేస్తాడు. దేశంలో పవిత్రమైన వ్యవస్థ ఉందంటే పెళ్ళి అనే వ్యవస్థ. అటువంటి వ్యవస్థను రోడ్డుమీదకు విసిరేశాడు. నిత్య పెళ్లికొడుకుగా నాలుగేళ్లకోసారి భార్య‌ల‌ను మార్చడం.. ఇదేనా మగత‌నం అని అడుగుతున్నా.! పవన్‌కల్యాణ్‌ రెండో భార్య రేణదేశాయ్‌ అంట.. తాను కాపురం చేస్తూనే ఉండగానే వేరోక స్త్రీకి గర్భం చేసి ఇంటికి తీసుకువచ్చాడని అని ఆమె టీవీలో అన్న మాట.. అందుకు ఆయన గారి కార్యకర్తలు సోషల్‌ మీడియాలో వేధిస్తే మౌనంగా ఉండటమేనా మగతనం అంటే అని అడుగుతున్నా?. కొత్తకారులను మార్చినట్లు పెళ్ళాలను మారుస్తున్న పవన్‌ తప్పును ఎవరైనా ఎత్తిచూపిస్తే ఆ ఎత్తిచూపిన వ్యక్తుల ఇంటిలోని ఆడవాళ్ల మీద లేనిపోని అబద్ధాలు సోషల్‌ మీడియాలో సిగ్గులేకుండా పెట్టిస్తాడు. అది మగతనమా?” అని పవన్‌‌పై తీవ్రస్థాయిలో జగన్ ధ్వజమెత్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here