మల్లాపూర్ రోడ్ షో సక్సెస్.. సమస్యలన్నీ పరిష్కరిస్తానన్న కేటీఆర్

0
603

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో యువ నాయకుడు, తాజా మాజీమంత్రి కేటీఆర్ ఉప్పెనలా దూసుకెళ్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలియతిరుగుతూ టీఆర్‌ఎస్‌‌ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతున్నారు. గురువారం నాడు ఉప్పల్‌‌లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చి విజయవంతం చేశారు. భారీ జనాన్ని సమీకరించడంలో పన్నాల దేవేందర్ రెడ్డి, మేడల జ్యోతి మల్లిఖార్జున్ గౌడ్, ఇతర ముఖ్య కార్యకర్తలు కీలకపాత్ర పోషించారు. భేతి సుభాష్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన కేటీఆర్ రోడ్ షో కార్యక్రమంలో చిన్నపాటి అవాంఛనీయ ఘటనలు తప్ప షో మాత్రం గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు పలు హామీలిచ్చారు. త్వరలోనే చర్లపల్లిలో కొత్తగా రైల్వే టర్మినల్ రానున్నట్టు ఆయన స్పష్టం చేశారు. ఈసీఐఎల్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎమ్‌ఎమ్‌టీఎస్ ట్రెయిన్ సౌకర్యాన్ని తీసుకురానున్నట్టు తెలిపారు. కేటీఆర్ ఈ మాట అనగానే సభకు వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు. భవిష్యత్తులో ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకు మెట్రో రైలు తీసుకొస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చారు. నియోజకవర్గానికి సంబంధించిన అన్ని సమస్యలను సుభాష్‌రెడ్డి తనకు వివరించారని.. ఎన్నికల అనంతరం ప్రతీ సమస్యను పరిష్కరించడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తానని కేటీఆర్ తెలిపారు. ఉప్పల్ ప్రాంతంలో దుర్గందం వస్తుందని భేతి తనకు చెప్పారని.. ఇదంతా గత పాలకుల వల్ల వచ్చిన సమస్య అని ఆయన చెప్పారు. అందుకే.. రూ.146 కోట్ల రూపాయలతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను క్యాపింగ్ చేస్తున్నామన్నారు.

మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి…
ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కేటీఆరే సీఎం అని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ వ్యవహారంపై ఉప్పల్ సభావేదికగా క్లారిటీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ గెలిస్తే.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రవుతారు.. ఇందులో ఎలాంటి సందేహాల్లేవు. మరి మహాకూటమి గెలిస్తే.. ఎవరు ముఖ్యమంత్రి అవుతారు. జిల్లాకు నలుగురున్నారు. 40 మంది ముఖ్యమంత్రులున్నారు. సీట్లు పంచుకునేకి తెలివి లేనోళ్లు రాష్ర్టాన్ని పాలిస్తారట. సీఎం కుర్చీ కోసం నానా తంటాలు పడుతున్నారు. ఆ కుర్చీ కోసం తన్నులాడుకుంటున్నారు. రాజకీయ స్తిరత్వం లేదు మహాకూటమిలో లోపించిందిఅని కేటీఆర్ తెలిపారు.

కేటీఆర్ నోట రంగం స్థలం డైలాగ్స్, సాంగ్స్..!
సుకుమార్ దర్శకత్వంలో రాంచరణ్, సమంత నటీనటులుగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రంలో ఎన్నికలప్పుడు ఆ గట్టునుంటావా.. అనే పాట ఉంటుంది. ఆ పాటను కేటీఆర్ స్వయాన తన నోటితోనే చెబుతూ.. ఓ సినిమాలో పాటలో ఉన్నట్టుగా.. నాగన్నా.. ఆగట్టు మీదుంటవా.. ఈ గట్టు మీదుంటవా.. ఏగట్టు మీదుంటవో తేల్చుకో. ఈ గట్టు మీద అడగకుండనే 24 గంటలు కరెంట్ ఇచ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి సుభాష్ రెడ్డి ఉన్నారు. ఆ గట్టు మీద దోచుకుతిన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆ గట్టున డబ్బా ఇల్లు ఉన్నాయి. ఈ గట్టున డబుల్ బెడ్ రూం ఇండ్లు ఉన్నాయి.. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి.. అందుకే ఏ గట్టునుండాలో మీరే నిర్ణయించుకోవాలని ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలను కేటీఆర్ కోరారు.

ఉప్పల్‌కు ఐటీ పరిశ్రమలొస్తాయ్!
ఎన్నికల్లో టీఆర్ఎస్ కనివినీ ఎరుగని రీతిలో గెలిపించాలని అభ్యర్థించిన కేటీఆర్.. ఉప్పల్ పారిశ్రామిక వాడలోకి ఐటీ పరిశ్రమలు తెప్పిస్తామన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో రూ.2,184 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఈ ప్రాంతం నుంచి ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రత్యేక తెలంగాణ వస్తే రాష్ట్రం మొత్తం ఆగమైతదని గత పాలకులు ఎన్నో అపోహలు సృష్టించిన విషయాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామని కేటీఆర్ ఉప్పల్ సభలో చెప్పారు.

కేటీఆర్ రోడ్‌షోకు ఉప్పల్ నియోజకవర్గంలోని కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు పెద్ద ఎత్తున జనాన్ని తరలించారు. కాగా ఇక్కడ ఒకరిద్దరు ముఖ్యనేతల గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మల్లిఖార్జున్ గౌడ్:- ఈయన నాచారం టీఆర్ఎస్ ఆరో డివిజన్ అధ్యక్షులు. ఇతను శాసనసభ రద్దు మొదలుకుని నేటి వరకూ జనాల్లోనే తిరుగుతూ భేతి సుభాష్ రెడ్డి గెలుపుకోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కేటీఆర్ షోకు.. ఆడుపడుచులతో బతుకమ్మను ఎత్తించి పెద్ద ఎత్తున కార్యక్రమానికి మహిళలను సమీకరించి రోడ్‌షో తీసుకొచ్చారు.

ప్రీతిరెడ్డి:- ఈమె ఉప్పల్ నియోజకర్గం పరిధిలో టీఆర్‌‌ఎస్‌ తరుఫున భేతి సుభాష్ రెడ్డికి మద్దతుగా జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తోంది. క్రియాశీల నేత. ప్రజలకు ఫలానా సమస్య ఉందని తనను సంప్రదిస్తే చాలు పాలకులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తనవంతుగా పరిష్కారం చూపుతుంటారు. భేతి సుభాష్ గెలుపుకోసం గడపగడపకు తిరుగుతున్నారు. గురువారం జరిగిన కేటీఆర్ రోడ్ షోకు ఆ వర్గం.. ఈ వర్గం అని కాకుండా పెద్ద ఎత్తున మహిళా కార్యకర్తలను తరలించారు.

పన్నాల దేవేందర్‌రెడ్డి:- ప్రస్తుతం ఈయన మల్లాపూర్ ఐదో డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్నారు. కార్పొరేటర్ పదవి వచ్చినప్పట్నుంచి ఇప్పటి వరకూ తనవంతుగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపారు. తనకు సాయం చేయాలని.. ఫలానా సమస్య ఉందని పన్నాల తలుపు తడితే పరిష్కార మార్గం చూపేందుకు శాయశక్తులా కృషిచేస్తుంటారు. అను నిత్యం డివిజన్ పరిధిలోని ప్రజలకు టచ్‌లో ఉంటుంటారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here