మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్న ‘శ్వేతా అవస్తి’!

0
134

అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరో హీరోయిన్లు‌గా హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’. అక్టోబర్-18న విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌తో షో సాగిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్వేతా అవస్తి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గురించి పూర్తి వివరాలు బయటికి రాలేదు కానీ.. అందం, ఆహార్యం.. నటనతో సినీ ప్రియులను బాగా ఆకట్టుకుంది. బహుశా రేపో మాపో మా సినిమాల్లో నటించండి అని వరుసగా దర్శకనిర్మాతలు అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

అమ్మాయికి అందం అభినయం ఉంది. ముఖ వర్చస్సు.. అందం.. ఎలాంటి సీన్‌లో అయినా ఒదిగిపోయేలా ఉంది. మరీ ముఖ్యంగా ‘మళ్ళీ మళ్ళీ చూశా’ సినిమా పరంగా చూస్తే.. శ్వేతా అవస్తి ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయ్. మున్ముంథు దర్శకనిర్మాతలు అవకాశాలిస్తే ఈ కొత్త బ్యూటీ తనను తాను నిరూపించుకుంటుంది. ఇకపై ఇంకా మంచి మంచి కథలను ఎంచుకుని.. ఇదే ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ముందుకెళ్తే ఈ కొత్తమ్మాయి ఫ్యూచర్‌కు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. సో.. మొత్తమ్మీద ఒక్క మాటలో చెప్పాలంటే.. టాలీవుడ్‌లో కొత్త బ్యూటీ వచ్చింది.. కాస్త అవకాశాలిచ్చి ప్రోత్సహించండి.. మంచి నటిగా సినీ ప్రియులకు.. తెలుగు ఇండస్ట్రీకి పేరు తెచ్చిపెడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here