‘మళ్ళీ మళ్ళీ చూశా’కు పాజిటివ్ రివ్యూస్ ఇచ్చినందుకు థ్యాంక్స్!

7
482

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం చేస్తూ హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మించిన యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ ‘మళ్ళీ మళ్ళీ చూశా’. శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్లు. ఈ చిత్రం అక్టోబర్‌ 18న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో…

దర్శకుడు హేమంత్ కార్తీక్ మాట్లాడుతూ..‘చాలా సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న టైంలో కోటేశ్వరరావు గారు ఏజ్ కాదు.. టాలెంట్ ఇంపార్టెంట్ అని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు ముందుగా ఆయనకు ధన్యవాదాలు. అనురాగ్ నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లా కలిసిపోయి ఈ సినిమా చేశాం. మా ఇద్దరి మధ్య అంత కో-ఆర్డినేషన్, కోఆపరేషన్ ఉంది కాబట్టే సినిమా ఇంత బాగా వచ్చింది. అలాగే మా డిఓపి కళ్యాణ్ అన్న టెక్నికల్ గా చాలా సపోర్ట్ చేశారు. శ్రావణ్ భరద్వాజ్ తన సంగీతం తో సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు, ఎలేంద్ర మహావీర్ ఒక పెద్ద సినిమాలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. శ్వేతా అవస్థి తెలుగు రాక పోయినా చాలా బాగా అర్ధం చేసుకొని నటించింది’ అన్నారు.

లిరిసిస్ట్ తిరుపతి జవాన్ మాట్లాడుతూ..‘ఆర్టిసి క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ లో సినిమా చూశాం. ఆడియన్స్ నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలు అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్స్’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్ పాలకుర్తి మాట్లాడుతూ.. ‘ఈరోజు ఈ స్టేజి మీద ఉండడానికి కారణం మీడియా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబెట్టారు. దాదాపు 150 సినిమాలకు పిఆర్ఓగా చేశాను. దీనంతటికీ కారణం అయిన మీడియాకి ఎప్పటికి రుణపడి ఉంటాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలకు ఎప్పుడూ సపోర్ట్ చేసే మీడియాలో నేను ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. రాంబాబు, రాము అన్నఈ ఇద్దరూ క్రిషి క్రియేషన్స్‌ కి రెండు పిల్లర్స్. అందరూ కొత్తవారైనా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఈ వీకెండ్స్ లో థియేటర్స్ పెంచుతున్నారు. సినిమా ఇంకా మంచి విజయం సాధించాలి’అన్నారు.

హీరోయిన్ శ్వేతా అవస్థి మాట్లాడుతూ..‘సంధ్య 70 ఎంఎంలో సినిమా చూశాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో అనురాగ్ కొణిదెన మాట్లాడుతూ.. ‘మేము ఇక్కడ ఇంత బాగా మాట్లాడుతున్నాం అంటే మైత్రి రవి గారు, అనిల్ సుంకర గారు చాలా సపోర్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా వారిద్దరికీ నా హృద‌య‌పూర్వక ధ‌న్యవాదాలు. యంగ్ టీమ్ ఏదో ఒకటి చేసి పెద్దగా కొట్టాలని క‌సితో ఈ సినిమా చేశాం. మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మీడియా ప్రతి చోట పాజిటివ్ రివ్యూస్ ఇచ్చి మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా యాక్షన్, పెర్ఫామెన్స్ కొత్త హీరోలా లేదు అని రాసి నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. కార్తీక్ సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మా క్రిషి క్రియేషన్స్‌ తరపున థాంక్యూ’ అన్నారు.

అనురాగ్‌ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌, అన్నపూర్ణమ్మ, అజయ్‌, మధుమణి, ప్రభాకర్‌, టి.ఎన్‌. ఆర్‌, మిర్చి కిరణ్‌, కరణ్‌, బాషా, ప్రమోద్‌, పావని, జయలక్మి, మాస్టర్‌ రామ్‌ తేజస్‌, బంచిక్‌ బబ్లూ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

రచన, దర్శకత్వం : హేమంత్‌ కార్తీక్‌
నిర్మాత : కె. కోటేశ్వరరావు
బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌: ఎలేంద్ర మహావీర్‌
సంగీతం : శ్రవణ్‌ భరద్వాజ్‌
సినిమాటోగ్రఫీ : సతీష్‌ ముత్యాల
ఎడిటర్‌ : సత్య గిడుతూరి
లిరిక్స్‌ : తిరుపతి జావాన
ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ : సాయి సతీష్‌ పాలకుర్తి.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here