‘మహర్షి’ రూపంలో మహేష్ మరోసారి ఆకర్శించాడుగా!

0
224

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. మహేష్‌ కెరీర్‌లో ఇది 25వ చిత్రం కావడం విశేషం. చిత్రంలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తాజాగా మార్చి 29 నుంచి ఈ చిత్ర మ్యూజికల్ జర్నీ స్టార్ట్ కాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ మేరకు నిన్న(బుధవారం) .. సముద్రం ఒడ్డున ముగ్గురు స్నేహితులు అటు వైపు మొహం చూపించి బ్యాక్ షాట్ లో ఉన్న పిక్ తో ఈ విషయాన్ని ప్రకటించిన చిత్రయూనిట్.. తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్డేలు స్నేహానికి ప్రతిరూపంగా ముగ్గురూ కలిసి సరదాగా కబుర్లు చెబుతూ నవ్వుతు తుళ్ళుతూ వెళ్తున్నట్లుగా చాలా క్యూట్ గా కనిపిస్తున్నారు. ఈ పిక్ చూసి మహేష్ అభిమానులు తెగ ముచ్చట పడుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here