‘మిస్టర్ సౌత్ ఇండియా’గా అల్లాడి ప్రీతమ్ కల్యాణ్

0
145

‘ఇట్లు గుణ H2ఓ’ చిత్రంతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న యువ తెలుగు తేజం అల్లాడి ప్రీతమ్ కల్యాణ్ ‘మిస్టర్ సౌత్ ఇండియా-2019’ టైటిల్ గెలుచుకున్నాడు. సౌత్ ఇండియాలోని అయిదు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో పాల్గొన్న ఈ పోటీలో సెమి ఫైనల్ రౌండ్ కు 20 మంది ఎంపిక కాగా.. ఆరుగురు ఫైనల్స్ కు చేరారు. వారిలో ప్రీతమ్ విజేతగా నిలిచాడు. అంతేకాదు, ‘మిస్టర్ బ్రైట్ స్మైల్’ కిరీటం కూడా కైవసం చేసుకున్నాడు. ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ ఈవెంట్స్ అనే సంస్థ ఈ పోటీని నిర్వహించింది. ప్రీతమ్ కల్యాణ్ పరిచయ చిత్రం ‘ఇట్లు గుణ H2ఓ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here