ముక్కు పిండేస్తానని.. నన్ను చూస్తే కేసీఆర్ పారిపోతాడు: కేఏ పాల్

0
101

తనను చూస్తే ఎక్కడ ముక్కు పిండేస్తానో అనే భయంతో కేసీఆర్ పారిపోతాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో కేఏ పాల్ మాట్లాడుతూ.. కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్‌కు ఓటేయటమంటే మోదీ, కేసీఆర్‌లకు వేయడమేనని కేఏ పాల్ స్పష్టం చేశారు. ఇక జనసేన గురించి ఆయన మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారని.. ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎవరైనా ధనవంతురాలిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకొచ్చి ఇస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. గుండు గీయించుకునే కాపుకు ఓటేస్తారా?, గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని కేఏ పాల్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here