మెసేజ్‌‌ చేస్తే ఇంటికొస్తారు.. ఓటేశాక దించి వెళ్తారు

2
691

ఇదేంటి రాజకీయ నాయకులు మరీ ఇలా తయారయ్యేరంటబ్బా..! ఓటుకోసం మరీ ఇన్ని సౌకర్యాలు చేస్తున్నారా.. అని ఆశ్చర్యపోతున్నారా..! అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇదంతా దివ్యాంగుల కోసం జీహెచ్‌ఎంసీ చేపడుతున్న ప్రత్యేక రవాణా సదుపాయం. ఓటు వేయడానికి వచ్చే దివ్యాంగులు ఇబ్బందులు పడకూడదని జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. దివ్యాంగుల కోసం ఇలా ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారి.. అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిషోర్‌ మీడియాకు వివరించారు.

కాగా.. ఈ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఉండుంటే బాగుండేదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో అయితే ఆయా గ్రామాల్లో సమీపంలో ఉన్న పాఠశాలలోనే పోలింగ్ జరుగుతుంది గనుక పెద్ద ఇబ్బందులుండవ్.. హైదరాబాద్‌లాంటి పెద్ద సిటీలో ఎవరి ఓటు ఎక్కడుందో తెలియని పరిస్థితి..? ఇవాళ ఓ ప్రాంతంలో నివాసముంటే రేపు ఇంకో ప్రాంతానికి మారుతుంటారు గనుక.. అధికారులు ఆలోచించి వాహన సౌకర్యం కల్పించారని తెలుస్తోంది. కాగా హైదరాబాద్ మొత్తమ్మీద సుమారు 20,000 మంది దివ్యాంగులు ఉన్నారని సమాచారం. నగరంలోని 15నియోజకవర్గాల్లో మూడువేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది.

వాహనం కోసం ఇలా చేయండి..
వాదా (వీఏఏడీఏ) అనే యాప్‌‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌‌లోడ్ చేసుకొని వివరాలు నమోదు చేయండి
వాయిస్‌ మెసేజ్‌ ద్వారా చిరునామా, సమీపంలోని పోలింగ్‌ కేంద్రం వివరాలు తెలియజేయండి
తెలుగు, ఉర్దూ, ఆంగ్లంలో తమకు వచ్చిన భాషలో వాయిస్‌ మెస్సేజ్‌ పంపొచ్చు
మెసేజ్ చేసిన ఐదు పది నిమిషాల్లోనే వాహనం మీ ఇంటిముందుకొచ్చేస్తుంది.
సంబంధిత సిబ్బంది వచ్చి వాహనంలో వచ్చి ఓటేసే వారిని తీసుకెళ్తారు.
ఓటు వేసిన అనంతరం మళ్లీ మీ ఇంటి దగ్గర దింపి వెళ్తారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here