మోడీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్న చంద్రబాబు!

0
497

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నమ్మించి మోసం చేసిన బీజేపీ పార్టీకి.. ప్రస్తుతం రాష్ట్రాల్లోనే గాక దేశ రాజకీయాల్లో సైతం చంద్రబాబు దూసుకుపోతున్న తీరు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత మొత్తుకున్నా వినని మోడీ.. ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి నెలకొంది. ఇటీవలే రాహుల్ గాంధీతో చేతులు కలిపిన చంద్రబాబు వేస్తున్న స్కెచ్, ఆయన దూకుడు చూసి మోడీకి వణుకు పుడుతోంది.

కాంగ్రెస్ తో చేతులు కలిపిన చంద్రబాబు.. జాతీయ రాజకీయాల్లో పెను ఉప్పెనలా తయారయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేయటంలో కీలక పాత్ర పోషిస్తూ మోడీ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమజ్వాదీ, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీలు ఇలా అందరూ బెంబేలెత్తుతున్న తరుణంలో చంద్రబాబు రాక వారికి కొండంత బలాన్నిచ్చింది. ఈ విషయాన్ని గ్రహించిన అన్ని జాతీయ పార్టీలు మహాకూటమిలో కలిసేందుకు సిద్ధమయ్యారని సమాచారం. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరేందుకు సానుకూలంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు రాకతో మహాకూటమికి మరింత బలం చేకూరిందని, ప్రజల్లో స్పందన కూడా పెరుగుతోందని, కూటమిలో చేరేందుకు పార్టీలు ముందుకొస్తున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చెప్పటం గమనార్హం. మహాకూటమిలో ప్రస్తుతం కాంగ్రెస్‌, తెలుగుదేశం,ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, డీఎంకే, జేడీఎస్‌, ఎన్సీపీ, ఆర్జేడీ, జేఎంఎం, జార్ఖండ్‌ వికాస్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌ దళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీడీపీ, లోక్‌ తాంత్రిక్‌ జనతాదళ్‌, సీపీఐ, సీపీఎం, ఆప్‌ తదితర పార్టీలు ఉన్నాయి. ఒడిసాలో బీజేడీ మహాకూటమిలో చేరేందుకు సిద్ధమవుతోంది. కాశ్మీరులోని పీడీపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ రెండూ కూటమిలో చేరే అవకాశముందని తెలుస్తోంది. ఇన్నాళ్లు మోడీకి మద్దతుగా ఉన్న జేడీయూ కూడా మహాకూటమి వైపే మొగ్గుతోందని సమాచారం.

దీన్నిబట్టి చూస్తే చంద్రబాబు కాంగ్రెస్ తో చేతులు కలపటం, ఆ తర్వాత మెల్లమెల్లగా కాంగ్రెస్ బలోపేతం కావటానికి కారణం ప్రత్యక్షంగా మోదీనే అని తెలుస్తోంది. ముందే గనక బాబును తన గూటిలో నుంచి పోకుండా చూస్తే.. ఈ పరిణామాలు చోటుచేసుకోకుండా ఉండేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంటే బాబును దూరం చేసుకొని పెద్ద పొరపాటు చేశానా? అని తనకు తానే ప్రశ్నించుకునే స్థాయికి వెళ్లారు మోదీ అని స్పష్టంగా అర్థమవుతోంది కదూ..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here