యాక్షన్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో ‘డిస్కోరాజా’

disco raja busy busy in action scenes

0
101

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్న చిత్రం “డిస్కోరాజా“. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ ప్ర‌స్తుతం హైదరాబాద్ లో జ‌రుగుతుంది. ఈ షెడ్యూల్ లో హీరో రవితేజ తో ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. హైద‌రాబాద్ అల్యూమినీయం ఫ్యాక్ట‌రీలో భారీగా వేసిన‌ సెట్ లో ప్ర‌స్తుతం హీరో, విలన్ మ‌ధ్య పోరాట స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ‌ఈ చిత్రం లో ఆర్ ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్, నన్ను దోచుకుందువటే ఫేమ్ నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రామ్ తళ్ళూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

న‌టీన‌టులు:
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
పీఆర్ఓ : ఏలూరు శ్రీను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here