రణరంగం రివ్యూ: రంగుపడుద్ది

3
2133

విడుదల: 03 – 05 – 2019
సమర్పణ: కిషోర్ రాఠీ
బ్యానర్: మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా ప్రై లిమిటెడ్
ఎడిటింగ్: నందమూరి హారి
మ్యూజిక్: సుభాష్ ఆనంద్
కథ: మహేష్ రాఠీ
నిర్మాత: మహేష్ రాఠీ
దర్శకత్వం: ఎస్ శ్యామ్ ప్రసాద్
నటీనటులు: ఆలీ, ధనరాజ్, జబర్దస్త్ అప్పారావు, రఘుబాబు, షేకింగ్ శేషు, సుమన్ శెట్టి, హీనా తదితరులు ..

అప్పట్లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మిచిన కిషోర్ రాఠీ చాలా గ్యాప్ తరువాత నిర్మించిన చిత్రం రంగు పడుద్ది. ఆలీ ముఖ్య పాత్రలో హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాలో ఎవరికీ రంగు పడింది .. ఎవరు రంగు వేశారు అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

స్టోరీ:
అలీ, జబర్దస్త్ అప్పారావు, షేకింగ్ శేషు ముగ్గురు మిత్రులు. టైం మిషన్ కు సంబందించిన వివరాలు తెలుసుకుని టైం మిషన్ లో ప్రవేశించి గత కాలంలో ఉన్న డబ్బు, వజ్రాలు, నిధి సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో టైం మిషన్ తో ట్రావెల్ చేసిన ఐ ఆమ్ అయ్యర్ ని కలుస్తారు. అయ్యర్ సైన్టిస్ట్. టైం మిషన్ లో మీరు కోరుకున్న కాలానికి వెళ్లొచ్చని వీరికి చెబుతారు. అచ్చంగా ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్న మరో టీమ్ ధనరాజ్, సుమన్ శెట్టి, హీనా లుకూడా గతంలోకి వెళ్లి అక్కడి విషయాలను తెలుసుకోవాలన్న కుతూహలంతో ఉంటారు. వీరు కూడా అయ్యర్ ని కలిసి తమ కోరికను బయటపెడతారు. అయితే భూమిపై బ్లాక్ హొల్స్ తెరచుకున్నప్పుడు టైం మిషన్ లో మీకు కావలసిన కాలానికి వెళ్లొచ్చని వీద్దరికి వికారాబాద్ అడవిలో ఉన్న ఓ భూత్ బంగ్లాకు రమ్మంటాడు. అక్కడికి చేరుకున్న ఈ రెండు టీమ్ లకు జరిగిన సంఘటనలు ఏమిటి? దెయ్యాల బంగ్లాలో వీరు ఎలా చిక్కుకున్నారు. ఎన్ని పట్లు పడ్డారు, చివరికి అక్కడి దయ్యాలనుండి బయటపడ్డారా లేదా అన్నది మిగతా కథ.

ఆర్టిస్టుల పనితీరు:
హర్రర్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పూర్తిస్థాయి వినోదం నేపథ్యంలో తెరకెక్కింది. మెయిన్ హీరోగా నటించిన ఆలీ .. ఓ వైపు భయపడుతూనే .. మరోవైపు హీరోయిజాన్ని ప్రదర్శిస్తుంటాడు. సినిమాలో అందరు కామెడియాన్స్ కాబట్టి కామెడీ విషయంలో వాళ్ళ టైమింగ్స్ తో బాగా నవ్వించే ప్రయత్నం చేసారు. ముఖ్యంగా జబర్దస్త్ అప్పారావు కొన్ని సన్నివేశాల్లో నిజంగా దెయ్యంలా భయపెట్టాడు. ఇక ధనరాజ్, షేకింగ్ శేషు, సుమన్ శెట్టి, అప్పారావు లు బూత్ బంగ్లాలో చేసే హంగామా ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తుంది. ఇక హీరోయిన్ హీనా తనదైన గ్లామర్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. టైం మిషన్ తో ట్రావెల్ చేసే సైన్టిస్ట్ పాత్రలో రఘుబాబు ఆకట్టుకున్నాడు.

సాంకేతిక నిపుణుల తీరు:
హర్రర్ సినిమాలకు కీలకమైంది .. రీ రికార్డింగ్. సుభాష్ ఆనంద్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది. అక్కడక్కక హర్రర్ ఎఫెక్ట్ తో ప్రేక్షకులను భయపెట్టే ప్రయత్నం చేసారు. ఇక ఫోటోగ్రఫి, ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ చిత్రానికి కథ అందించిన మహేష్ రాఠీ నిజంగా ఓ కొత్త ప్రయత్నం చేసాడని చెప్పాలి. హర్రర్ సినిమా అనగానే పాత పాడుబడ్డ బంగాళా .. అందులో లేడి దెయ్యం .. ఇది రొటీన్ హర్రర్ ఫార్ములా కానీ అసలు ఆ ఇంట్లో దెయ్యం ఉందన్న భావనతో రెండు టీమ్స్ ఒకరికి ఒకరు దెయ్యాలు అనుకుంటూ భయపడేలా కథను కొత్తగా రాసుకున్నాడు. నిజానికి అందులో ఏ దెయ్యం ఉండదు .. అదే అసలు ట్విస్ట్ ? ఇక దర్శకుడు శ్యామ్ ప్రసాద్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. అయితే కథ విషయంలో ఇంకాస్త క్లారిటీ ఉంటె బాగుండేది. ఎంతసేపు దెయ్యం ఉందన్న ఎఫెక్ట్ చూపించిన దర్శకుడు రెండు టీమ్స్ ఎదురుపడ్డప్పుడు జరిగే సన్నివేశాలను సడన్ గా కట్ చేయడంతో కాస్త కన్ఫ్యూజ్ కు గురవుతారు ప్రేక్షకులు.

విశ్లేషణ :
రొటీన్ ఫార్ములా.. పాడుబడ్డ బంగాళా .. అందులో భిన్నమైన శబ్దాలు .. ఓ లేడి దెయ్యం. ఇదే, ఏ హర్రర్ సినిమా చూసినా .. కానీ దానికి కాస్త బిన్నంగా ఎక్కడ దెయ్యం అనేది కనిపించకుండా వాళ్లలో వారే చూసుకుని దెయ్యంగా భావించి భయపడే సన్నివేశాలు బాగున్నాయి. డైలాగ్స్ పరవాలేదు. ఎడిటింగ్, ఫోటోగ్రఫి ఆకట్టుకునే అంశాలు. ముఖ్యంగా జబర్దస్త్ అప్పారావు, హీనాల మధ్య సాగే చినుకు చినుకు అందెలతో పాటతో మరోసారి మనీష ఫిలిమ్స్ పాత జ్ఞాపకాలు టచ్ చేసారు. మొత్తానికి సరదాగా నవ్వుకోవాలనుకునే వారికీ నిజంగా నవ్వించి రంగు పడేలా చేసే సినిమా ఇది.

రణరంగం ట్యాగ్‌లైన్: నవ్వులే నవ్వులు అని టైటిల్ పెట్టాల్సింది

రణరంగం రేటింగ్: 3/5

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here