‘రణరంగం’ సర్వే… వైసీపీదే గెలుపు

ranarangam.com exit poll survey on ap elections

0
151

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఇప్పటి వరకూ పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. పలు వెబ్‌సైట్స్, టీవీ చానెల్స్ సైతం ఏపీ సీఎం జోస్యం చెప్పేశాయి. అయితే అందరి లాగా కాకుండా అసలు టీడీపీకి ఎక్కడ దెబ్బ పడింది..? టీడీపీ మైనస్ పాయింట్స్ ఏవి..? వైసీపీకి ఏం కలిసొచ్చాయ్..? ఇలా నిశితంగా లెక్కలేసి.. 2014కు ఇప్పటికీ చంద్రబాబు గ్రాఫేంటి..? వైఎస్ జగన్ గ్రాఫేంటి..? ఎవరి గ్రాఫ్ పెరిగింది..? ఎవరి గ్రాఫ్ తగ్గింది ఇలాంటివన్నీ భేరీజు చేసుకుని ‘రణరంగం.కామ్’ (www.ranarangam.com) వెబ్‌సైట్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించింది.

కాగా.. మా ఈ వెబ్‌సైట్స్ చేసిన సర్వేలు తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అక్షరాలా నిజమయ్యాయని మరోసారి గుర్తు చేస్తున్నాం. అదే విధంగా ఏపీలో కచ్చితంగా అనుకున్నట్లుగానే అక్షరాలా నిజమవుతుందని ranarangam.com యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.

‘రణరంగం’ పోస్ట్‌ పోల్ సర్వే అక్షర సత్యమైంది!

:- ఎవరికెన్ని సీట్లు..:-
అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే…
వైసీపీ : 95-125
టీడీపీ : 45-60
జనసేన : 0-01

ఎంపీ సీట్ల విషయానికొస్తే…
వైసీపీ : 18-20
టీడీపీ : 5-7
జనసేన : 0-0

టీడీపీకి ఎక్కడ దెబ్బ పడింది!
– మాట నిలకడలేనితనం బాబులో అతి పెద్ద మైనస్
– రెండో మైనస్.. పుత్రుడు నారా లోకేష్
– ఐదేళ్లలో ఎన్నో.. ఎన్నెన్నో యూటర్న్‌లు
– ప్రత్యేక హోదా విషయంలో పిల్లి మొగ్గలేయడం
– హోదా కోసం ఉద్యమించిన వారిని జైలుపాలు చేయడం
– హోదా వస్తే ఏమొస్తుంది..? అన్న చంద్రబాబే వెనక్కి తగ్గడం
– ధర్మపోరాటం దీక్షల పేరుతో కోట్లు ఖర్చుపెట్టడం
– అను‘కుల’ మీడియాలో డబ్బా కొట్టుడు కార్యక్రమాలు ఎక్కువ కావడం
– రాజధానిలో రైతుల భూముల ఆక్రమణ
– భూసేకరణ పేరుతో వేలాది ఎకరాలు సొంత పార్టీ నేతలు ఆక్రమించడం
– రాజధానికి 30 ఎకరాలు చాలని చెప్పి 30,000 ఎకరాలకు పైగా సేకరించడం
– రాజధానికి భూములివ్వని రైతులపై దాడులు, ధౌర్జన్యాలు చేయడం
– గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో చాలా వరకు వ్యతిరేకత రావడం
– గ్రామ స్థాయిలో జన్మభూమి కమిటీల అవినీతి తారాస్థాయికి వెళ్లడం
– 2014లో సుమారు 600కు పైగా హామీలిచ్చి అరకొర అమలు చేయడం
– సామాజిక వర్గాల పరంగా ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడం
– కాపులకు రిజర్వేషన్ ఇస్తామని ఇవ్వకపోగా.. కేంద్రంపై నెట్టడంతో ఆ వర్గంలో పూర్తి వ్యతిరేకత
– ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడం
– అగ్రకులాలను ప్రోత్సహిస్తూ.. అణగారిన వర్గాలను పెద్దగా పట్టించుకోకపోవడం
– టీడీపీ అనేది ఒక కులానికే పార్టీ అని ముద్ర పడటం
– రైతు రుణమాఫీ చేస్తానని ఆశించినంత స్థాయిలో చేయలేకపోవడం..
– డ్వాక్రా రుణాల మాఫీ చేయకపోవడం
– బంగారం రుణాలు మాఫీ చేస్తానని చేయకపోవడం..
– ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని అవకాశమిస్తే సద్వినియోగ చేసుకోకపోవడం
– ‘అమరావతి’ని సింగపూర్‌లా, జపాన్‌లా చేస్తానని చెప్పి ఆఖరికి ‘భ్రమారవతి’గా మిగిల్చడం
– సింగపూర్, మలేషియా అంటూ గ్రాఫిక్స్‌తో అరచేతిలో వైకుంఠం చూపించడం
– రాజధానిలో ఐదేళ్లలో ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కట్టలేకపోవడం
– చిత్తూరు, గుంటూరు, విజయవాడను తప్ప మిగతా జిల్లాలను పట్టించుకోకపోవడం
– ఐదేళ్లలో నిరుద్యోగులు ఆశించినంతగా ఉద్యోగ కల్పన కల్పించకపోవడం
– నిరుద్యోగుల భృతి సుమారు నాలుగున్నరేళ్లుగా ఇవ్వకుండా ఎన్నికల ముందు ఇవ్వడం
– మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఆఖరి నిమిషంలో పసుపు-కుంకుమ అంటూ హడావుడి
– మంత్రులు, ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున రావడం
– పోలవరం నిధులన్నీ తెలుగు తమ్ముళ్లు తినేశారని ఆరోపణలు రావడం
– ఐదేళ్లలో ఢిల్లీ, విదేశీ పర్యటనల్లోనే ఎక్కువగా బాబు ఉండటం
– మీడియా మేనేజ్మెంట్ తప్ప బాబుకు ఏమీ చేతకాదనే అపవాదును తుడుపుకోలేకపోవడం
– పార్టీలో కేవలం చంద్రబాబు ఒక్కడే అన్నీ అయి నడిపించడం
– అమరావతి, పోలవరం వంటి వాటి పేరు చెప్పి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇపుడు వాటిని ముందుంచి జనాలను ఓట్లు అడగలేని పరిస్థితి నెలకొనడం
– అవినీతి బంధుప్రీతి అన్న కామెంట్స్ వచ్చినపుడు దాన్ని తిప్పికొట్టడం బాబు వల్ల కాకపోవడం
– జనసేనతో రహస్య ఒప్పందం ఉందన్న అపవాదును కడుక్కోలేకపోవడం
– ఎన్నికల్లో ఎంత సేపూ బీజేపీ, వైసీపీనే తిట్టిపోయడం తప్ప చేసిందేమీ చెప్పలేకపోవడం
– ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేకపోవడం
– బీసీలు చంద్రబాబుతో లేకపోవడం.. వైసీపీ వైపు మగ్గు చూపడం
– సొంత సామాజిక వర్గం చంద్రబాబుతో లేకపోవడం
– పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం..
– మేనిఫెస్టో కాపీ కొట్టడం
– ఏపీలో నెలకొన్న విపత్తులను ఎదుర్కొనడంలో అట్టర్ ప్లాప్ అవ్వడం
– గ్రామస్థాయి మొదలుకుని అమరావతి వరకూ మన అనుకున్న వాళ్లనే ప్రోత్సహించడం..
– ఐటీ, సీబీఐలకు భయపడటం.. రాష్ట్రంలోకి రానివ్వకపోవడం
– బాబుపై ఉన్న కేసుల విషయంలో హంగామా.. స్టేలు అంతే తప్ప
– ఓటుకు నోటు కేసు మైనస్..
– ఎంతసేపూ వైసీపీ.. అదీ ఇదీ అనడం తప్ప ఏ మాత్రం నిరూపించలేకపోవడం
– జగన్ లక్ష కోట్లు.. తిన్నాడు అని పదేపదే చెప్పి .. ఆఖరికి బాబే కోటీశ్వరుడు అని జనాలకు తెలిసిపోవడం
– జగన్‌పై వచ్చిన ఏ ఒక్క ఆరోపణను నిరూపించలేకపోవడం
– ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తీవ్ర వ్యతిరేకత
– ప్రభుత్వ ఉద్యోగులపై అనుచిత వ్యాఖ్యలు వైరల్ కావడం
– అన్నగారు ఎన్టీఆర్ అవమానపరిచేలా ఏబీఎన్ ఎండీ ఆర్కే- చంద్రబాబు వ్యాఖ్యలు ఉండటం.. ఆ వీడియోలు బలంగా జనాల్లోకి వెళ్లడంతో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు వైసీపీ వైపు మగ్గు చూపడం
– 108 వాహనాలు కనుచూపు మేరలో కనిపించకపోవడం
– డేటా చోరీ, ఓట్ల గల్లంతు కార్యక్రమాలు టీడీపీనే చేసిందని ప్రజలు బలంగా నమ్మడం
– పోలింగ్ రోజే గొడవలు.. టీడీపీ అరాచకాలు చేసిందని తెలియడంతో జనాల మైండ్ సెంట్ మారడం (సత్తెనపల్లి, పూతలపట్టు, పుష్ప శ్రీవాణిపై దాడి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి)

టీడీపీకి ప్లస్ పాయింట్స్ ఇవే..!
– కావాల్సినంత మీడియా.. నిద్రలేచింది మొదలుకొని నిద్రపోయే వరకు డబ్బా కొట్టేందుకు అనుకూల       మీడియా
– నిరుద్యోగ భృతితో 100లో 10 శాతం టీడీపీకి ఓట్లేయడం
– సామాజిక వర్గం కలిసిరావడం
– బీజేపీని ఎండగట్టడంలో సక్సెస్ కావడం (ఏపీలో తప్ప..)

వైసీపీకి ప్లస్ పాయింట్స్..
– టీడీపీ మైనస్ పాయింట్స్ అన్నీ వైఎస్ జగన్‌కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి.
– వైసీపీ ప్రశాంత్ కిశోర్ పెద్ద ప్లస్ పాయింట్
– ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం
– జగన్‌కు ఓటేసి గెలిపిస్తే వైఎస్ కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తారని జనాలు నమ్మడం
– నవ రత్నాలు అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు
– సోషల్ మీడియాతో విస్తృతంగా జనాల్లోకి వెళ్లడం
– మేనిఫెస్టో జగన్‌కు బాగా కలిసొచ్చింది
– ప్రత్యేక హోదాపై మొదట్నుంచి ఒకే మాట మీద నిలబడటం
– 2014 మొదలుకుని ఇప్పటి వరకూ హోదా.. హోదా..
– మాట తప్పరు మడమ తిప్పరు అని జనాల్లో భావన కలగడం
– సుధీర్ఘ పాదయాత్ర.. నిత్యం జనాలతో టచ్‌లో ఉండటం
– ఎంపీల రాజీనామా
– అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులేయడం
– రాజధాని రైతుల పక్షాన పోరాటం చేయడం
– జగనే పార్టీలో అన్నీ అని కాకుండా విజయమ్మ, షర్మిళ, వైఎస్ భారతీని రంగంలోకి దింపడం
– బాయ్ బాయ్ బాబూ.. బాయ్ బాయ్ పప్పూ అనే నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లి చైతన్యం కలిగించడం
– చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదని జనాల్లోకి బాగా తీసుకెళ్లడం
– ఉభయ గోదావరి జిల్లాలు ఈసారి జగన్‌కు ప్లస్ కావడం
– రెడ్డి అనే సామాజిక వర్గమే కాకుండా బీసీ, ఎస్సీ-ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలు జగన్‌కే జై కొట్టడం
– ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల విషయంలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడం
– టీడీపీ-జనసేన ఒకటే అని జనాల్లోకి గట్టిగా తీసుకెళ్లడం.. కొన్ని కొన్ని ఆధారాలను చూపడం
– కోడికత్తితో దాడి కూడా వైసీపీకి ప్లస్ పాయింటే..
– ప్రశ్నిస్తానన్న పవన్ అధికార పార్టీని కాకుండా పదేపదే వైసీపీని తిట్టి పోస్తుండటంతో టీడీపీ-జనసేన ఒక్కటే అని జనాలకు అర్థమైపోవడం
– టీడీపీ స్ట్రాంగ్ ఉన్న చోట్ల జనసేన అభ్యర్థులను కాకుండా సీపీఐ, సీపీఎం అభ్యర్థులను బరిలోకి దింపడం
– బూత్ లెవల్ కమిటీలు వర్కవుట్వడం
– డేటా చోరీ, ఓట్ల గల్లంతు వ్యవహారాలను వెలికి తీసి టీడీపీ తీరును ఎండగట్టడం ఇలా వైసీపీకి చెప్పుకుంటూ పోతే చాలానే ప్లస్ పాయింట్స్ ఉన్నాయి.

:- వైసీపీ మైనస్ పాయింట్స్:-
– కేంద్రాన్ని గట్టిగా నిలదీయలేకపోవడం
– ఏ నాడూ మోదీని విమర్శించకపోవడం
– అసెంబ్లీకి సరిగ్గా వెళ్లకపోవడం

ఇలా.. టీడీపీ, వైసీపీ పార్టీలకు ప్లస్, మైనస్‌లు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు ప్రతి ఒక్కరూ ఎవరెన్ని డబ్బులిచ్చారు..? అనేది కాకుండా ప్రభుత్వం ద్వారా ఏ మేరకు లబ్ధి పొందాం..? ఇన్ని రోజులూ టీడీపీ మనకు ఏ మాత్రం మేలు చేసింది..? రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీని గెలిపిస్తే పరిస్థితేంటి..? అటు టీడీపీ పరిస్థితేంటి..? వైసీపీకి ఓటేస్తే మనకేమొస్తుంది..? 2014లో ఎవరేం చెప్పారు..? అవి ఏ మాత్రం అధికార పార్టీ అమలు చేసింది..? 2014లో జగన్ ఏం చెప్పారు..? ఇప్పుడేం చెబుతున్నారు..? ఇలాంటి వన్నీ ఓటర్లు నిశితంగానే ఆలోచించి బూత్‌కెళ్లి ఓటేశారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here