రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అవ్వనున్న మోదీ

0
407

ఈరోజు రష్యా కు చేరుకున్నమోదీ కి రష్యా అధికారులు ఘన స్వాగతం పలికారు. ద్వైపాక్షిక సమావేశాల కోసం మోదీ రష్యా కు వెళ్ళడం ఇది మూడవసారి. ఈ పర్యటనలో తూర్పు దేశాల సదస్సు తో పాటు భారత్-రష్యా 20 వ వార్షిక సదస్సు లో మోదీ గారు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి పాల్గొననున్నారు. రష్యా తో సత్సంబంధాల కోసం మోదీ పుతిన్ తో భేటీ అవ్వనున్నారు.
ఈ పర్యటనతో రష్యా తో ఉన్న సంబంధాలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. అలాగే ఈ సదస్సు లో పాల్గొననున్న ఇతర దేశాల ప్రతినిధులతోను వాణిజ్య పరమైన మరియు ఇతర అంతర్జాతీయ అంశాల్లో పరస్పర సహకారం పై కూడా చర్చలు జరగనున్నాయని తెలిపారు. రష్యాలోని లాడివోస్టొక్ ప్రాంతంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here