“రాజు గారి గది – 3” లో చిన్నారి పెళ్లి కూతురి హారర్ లుక్

0
216

 

టీవీ ప్రజెంటర్ ఓంకార్ దర్శకత్వంలో వచ్చిన హారర్ కామెడీ సినిమాలు ‘రాజు గారి గది’,’ రాజు గారి గది-2′ ఫ్రాంచెజీ లో వస్తున్న మరో సినిమా “రాజు గారి గది – 3”. వినాయక చవితి సందర్బంగా ఈ చిత్రం ఫస్ట్ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో అవికా గోర్ గోస్ట్ గా తన హారర్ లుక్ తో అదరగొట్టింది.
అవికా, చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ‘ఉయ్యాలా జంపాల’, ‘సినిమా చూపిస్త మామ’, ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తెలుగు సినిమాల్లో నటించి విజయం సాధించింది. రాజు గారి గది – 3 మూవీ లో అశ్విన్ బాబు హీరో గా, అవికా గోర్ హీరోయిన్ గా మరియు ఊర్వశి, హరి తేజ, అలీ, బ్రహ్మాజీ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్ తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రం మొదటి రెండు సినిమాల కన్నా బాగుంటుందని ఓంకార్ గారు చెప్పారు. దసరా పండుగకి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here