రికార్డు స్థాయిలో “సైరా” మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

0
235

ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం “సైరా”. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరుగుతుందని సమాచారం. ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ సినిమా 19.6 కోట్లకి అమ్ముడు పోయిందని అంచనా.
ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గా, ఆయన గురువు పాత్రలో అమితాబ్ బచ్చన్ గారు నటించారు. ఇంకా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క, నయనతార, తమన్నా తదితరులు నటిస్తున్నారు.ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో అక్టోబర్ 2 న విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here