రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం: పాక్ ప్రకటన

3
679

పాక్ చేతుల్లో బంధీగా ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ రేపు విడుదల కానున్నారు. ఐక్య రాజ్య సమితి వేదికగా భారత్.. దౌత్యపరమైన ఒత్తిడిని పెంచడంతో పాకిస్థాన్ దిగివచ్చింది. అభినందన్‌ను విడుదల చేస్తున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శాంతిని కోరుకుంటూ ఆయనను విడుదల చేస్తున్నట్టు ఇమ్రాన్ ప్రకటించగానే పాక్ పార్లమెంటు సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.

ఇటు భారత్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ.. పైలెట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేస్తున్నామన్నారు. తాను భారత్ ప్రధానితో మాట్లాడేందుకు ప్రయత్నించానని కానీ కుదరలేదని చెప్పుకొచ్చారు. పాక్ ఆర్మీ అభినందన్‌పై ప్రశ్నల వర్షం కురిపించినా.. చెక్కు చెదరని ధైర్యంతో కనిపించడంతో భారత ప్రజల్లో ఆయనపై విపరీతమైన గౌరవం, అభిమానం ఏర్పడ్డాయి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here