లగడపాటి సర్వే అచ్చు తప్పు.. నా సర్వేనే సక్సెస్!

లగడపాటి సర్వే అచ్చు తప్పు.. నా సర్వేనే సక్సెస్!

1
119

దేశ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో, రాష్ట్రాల్లో ఏయే పార్టీ అధికారంలోకి వస్తుందని పలు ప్రాంతీయ, జాతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. అయితే ఈ ఫలితాలు ఏ మాత్రం వర్కవుట్ అవుతాయన్నది పైనున్న దేవుడికెరుక. తండోపతండాలుగా ఇప్పటి వరకూ ఎన్నడూ లేనన్ని సర్వే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేశాయ్. మరికొందరైతే ఏకంగా జనాల్లోకి వెళ్లి ప్రత్యేకంగా సర్వే చేయనక్కర్లేదు.. జనాల నాడి ఏంటో మేం పట్టేస్తాం. మా సర్వే కచ్చితంగా వర్కవుట్ అవుతుందని చెప్పేస్తున్నారు.

అలా.. ఏపీ ఎన్నికల ఫలితాలపై జర్నలిస్ట్‌గా కొన్నేళ్లపాటు ప్రయాణం సాగించిన కురుబ నర్సింహులు అనే వ్యక్తి.. ప్రస్తుతం అనంతపురం జిల్లా ఎస్కే యూనివర్శిటిలో ‘లా’ చదువుతున్నాడు. ఏపీలో ఎవరుగెలుస్తారా..? అనేదానిపై పలు ప్రాంతీయ మీడియా సంస్థలు లాగే నర్సింహులు కూడా సర్వే చేశాడు. ఆంధ్రా ఆక్టోపస్, మాజీ ఎంపీ లగడపాటి సర్వే మరోసారి తప్పుతుందేమో కానీ తన సర్వే మాత్రం తప్పే ప్రసక్తే లేదని.. వందకు వంద శాతం వర్కవుట్ అవుతుందని చెబుతున్నాడు. కాగా తాను జనాల్లోకి వెళ్లి శ్యాంపిల్స్ సేకరించడం.. ఇలాంటి వ్యవహారాలన్నీ చేయకపోయినప్పటికీ.. అసలు ఏపీ ప్రజలు ఎవరివైపు ఉన్నారు..? టీడీపీ ప్లస్‌లేంటి..? వైసీపీ ప్లస్‌లేంటి..? టీడీపీకి ఉన్న మైనస్‌లు ఏంటి..? 2014లో టీడీపీ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలు చేసింది..? ఇలాంటివన్నీ తన ఊర్లో.. తనకు తెలిసిన మిత్రులతో.. బంధువులతో చర్చించి నిశితంగా నర్సింహులు సర్వే చేశాడు. కురుబ నర్సింహులు సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడు చూద్దాం

అసెంబ్లీ సీట్లు ఏ పార్టీకెన్ని..!?
వైసీపీ : 98-107
టీడీపీ : 67-75
జనసేన : 0-02

ఎంపీ సీట్లు ఏ పార్టీకెన్ని.!?
వైసీపీ : 16
టీడీపీ : 09
ఇతరులు : 00

అయితే.. నర్సింహులు చెబుతున్నట్లుగా మే-23న వైసీపీ గెలుస్తుందా..? లేకుంటే మరోసారి ఓటమి చవిచూస్తుందో.. లేకుంటే ఇంచుమించు వైసీపీనే గెలిచేస్తుందో తెలియాలంటే మరికొన్ని వేచి చూడాల్సిందే మరి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here