‘వినయ విధేయ రామ’ టీజర్ వచ్చేసింది

0
895

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్ర టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తున్న ఈ టీజర్ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ‘అన్నయ్య వీడిని చంపెయ్యాలా? భయపెట్టాలా?’ అనే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ కాగా.. భయపెట్టాలంటే 10 నిమిషాలు చంపేయాలంటే పావుగంట. ఏదైనా ఓకే సెలక్ట్ చేసుకో’ అంటూ చెర్రీ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్.. ఆకట్టుకుంటోంది. ‘ఇక్కడ రామ్ కొ..ణి..దె..ల’ అంటూ చెర్రీ మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. మరోవైపు టీజర్ చూసిన సినీ ప్రముఖులు హీరో రామ్‌చరణ్‌ నటనపై ప్రసంశలు కురిపిస్తున్నారు.

డీవీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా దేవీ శ్రీ బాణీలు కడుతున్నారు. సంక్రాంతి కానుకగా.. వినయ విధేయ రాముడు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here