వైసీపీలోకి టీడీపీ మంత్రి.. ముహూర్తం ఖరారు!

0
439

మంత్రి పదవి ఉన్న వ్యక్తి పార్టీ మారుతున్నారా..? ఇదేంటి అని ఆశ్చర్యపోతున్నారా అవును మీరు వింటున్నది అక్షరాలా నిజమే. కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ టీడీపీకి టాటా చెప్పేసి వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమైపోయారని సమాచారం. ఇందుకు కారణం.. ఆయనకు పేరుకే మంత్రి పదవి ఉంది తప్ప ఆయన్ను చినబాబు.. పెదబాబూ ఎవరూ పట్టించుకోవట్లేదట. ఈ తరుణంలో ఆయన తనకు విలువ, గుర్తింపు లేనిచోట మెలగడం కష్టమని అందుకే పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఈ విషయం పశ్చిమ గోదావరి జిల్లాలో కోడై కూస్తోందట. ముహూర్తం కూడా రెడీ చేసుకన్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అతి త్వరలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.

పితాని సత్యనారాయణ రెండు పర్యాయాలు ఆచంట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజానంతరం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి బాటలోనే పితాని నడిచారు. కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీకి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన పనిచేశారు. అనంతరం చెప్పుల గుర్తు పార్టీకి బాయ్ బాయ్ చెప్పేసి టీడీపీ కండువా కప్పుకుని 2014లో వైసీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజుపై 3,920 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇలా 2009,2014లో రెండుసార్లు గెలిచిన ఆయన్ను టీడీపీ అధికారంలోకి రాగానే కార్మికశాఖ కట్టెబెట్టింది.

కాగా.. పితాని శెట్టి బలిజ వర్గానికి చెందిన వ్యక్తి. ఈ వర్గం పశ్చిమగోదావరి జిల్లాల్లోని ఆచంట, నర్సాపూర్, పాలకొల్లు, నిడదవోలు, భీమవరం, తణుకు నియోజకవర్గాల్లో కాపు వర్గం తర్వాత ఈ కులస్థులే ఎక్కువగా ఉన్నారు. అలా కాపు వర్గంతో పాటు బలిజ వర్గాన్ని కూడా తన చేతిలో పెట్టుకోవాలని చంద్రబాబు యోచించి పితానికి మంత్రి కట్టబెట్టారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో పితాని టీడీపీకి టాటా చెప్పేస్తే బలిజ వర్గం ఓట్లు కచ్చితంగా చీలిపోతాయి.. తద్వారా సైకిల్‌కు పెద్ద షాకే తగులుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా ఇటీవల ఏపీ ఎన్నికలపై ఏ సంస్థ సర్వే చేసినా వైసీపీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రావడంతో దీపముండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని పితాని యోచిస్తున్నారట. అంతేకాదు రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని సైతం త్యాగం చేసి వచ్చిన పితానిని గుర్తించి ఏదో ఒక శాఖ అప్పగిస్తారని ఆయన ఆలోచనట. అయితే ఇది ఎంత మేరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here