శభాష్ సుహాసిని.. సంస్కారం చాటుకున్నావ్..!

0
555

అవును.. కూకట్‌‌పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీచేసి ఓటమిని చవిచూసిన నందమూరి సుహాసినిని కచ్చితంగా ఈ విషయంలో మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఓడిన తర్వాత కనీసం ఆ నియోజకవర్గం వైపు కొందరి నేతలు పొరపాటున కూడా తొంగిచూడరు. ఒక వేళ మళ్లీ ఇక్కడ్నుంచే పోటీ తప్పదనే పరిస్థితుల్లోనే ఏడాదికి ముందు నుంచే కార్యక్రమాలు మొదలెట్టేస్తారు. అలాంటిది తనపైనే నమ్మకంతో ఉన్న కూకట్‌‌పల్లి జనాలను మోసం చేయకూడదని భావించిన సుహాసిని ఫలితాలొచ్చిన అనంతరం మళ్లీ ప్రజల్లోకి వెళ్లడం విశేషం. అంతేకాదు.. ఈ ఓటమి నేపథ్యంలో సుహాసిని మళ్లీ కూకట్‌పల్లి వైపు చూడదనే అంతా అనుకున్నారు. అయితే తాజాగా కూకట్‌‌పల్లిలో జరిగిన సమావేశంలో ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తల్లో భరోసా నింపడానికి యత్నించారు.

సుహాసిని మాటల్లోనే..
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. అయితే నన్ను గెలిపించటం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి పార్టీ కార్యకర్తకూ నా ధన్యవాదాలు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నాను. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. చాలా ఓట్లు గల్లంతయ్యాయి. ‘నిరుత్సాహపడకండి.. మీకు అండగా నేనున్నాను. పార్టీ కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా నేను మీకు వెన్నంటే ఉంటానని మీకు తెలియజేస్తున్నాను అని సుహాసిని అభయమిచ్చారు. సుహాసిని ఇలా మాట్లాడుతుండగా మధ్యలో కలుగజేసుకున్న కార్యకర్తలు “ఈవీఎం టాంపరింగ్‌ వల్లే టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది..” అంటూ కార్యకర్తలు నినాదాలు, ఈలలు కేకలతో హోరెత్తించారు.

మొత్తానికి చూస్తే.. ఏదేమైనప్పటికీ ఓటమి తర్వాత కూడా ఇలా మీటింగ్ పెట్టి కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పి.. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపడం ద్వారా సుహాసిని తన సంస్కారాన్ని చాటి చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇలా చేసిన నందమూరి ఆడపడుచుకు శభాష్ చెప్పక తప్పదు. కాగా.. సుహాసిని గెలుపు పక్కా అనుకున్న కూకట్‌పల్లిలో ఈ రేంజ్‌‌లో ఓడిపోతారని బహుశా ఎవరూ ఊహించుండరేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here