షాకింగ్: వైసీపీ తరఫున ఎంపీగా ఎన్టీఆర్ పోటీ!?

will nandamuri hero jr ntr contest mp from ysr congress!?

11
897

జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా..? తన తాత పార్టీ తెలుగుదేశంను కాదని వైసీపీలోకి వస్తున్నారా..? గుంటూరు లోక్‌‌సభ నుంచి ఎన్టీఆర్ పోటీ చేయబోతున్నారా..? ఇటీవల జూనియర్ మామ వైసీపీ అధినేత జగన్‌‌ను కలవడం వెనక ఆంతర్యమిదేనా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే ఇది అక్షరాలా నిజమనిపిస్తోంది.!

సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయాల్లోకి వస్తారంటూ ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే వైసీపీలో చేరడం ఖాయమని.. ఇందుకు కర్త, కర్మ, క్రియ ఎమ్మెల్యే కొడాలి నాని అని హరికృష్ణ బతికున్నప్పుడు పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. అయితే ఆయన మాత్రం వాటన్నింటినీ ఖండిస్తూ వచ్చారు. ఇప్పటికే ఒకట్రెండు సార్లు టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసి తాతగారు లేని లోటును తీర్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఆ తర్వాత కొన్ని అనివార్యకారణాల వల్ల పార్టీకి దూరమయ్యారు. అంతేకాదు ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో పోటీచేసిన సొంత అక్క నందమూరి సుహాసిని పోటీ చేసినప్పటికీ కనీసం ప్రచారానికి కూడా వెళ్లలేదు. అయితే 2019 ఎన్నికల్లో బరిలోకి దిగి సత్తా చూపించాలని జూనియర్ సిద్ధమయ్యారని సమాచారం.

మామ వస్తాడా..? అల్లుడు వస్తాడా..?
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ మామ, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌‌ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు గుంటూరు పార్లమెంట్ టికెట్ విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. టికెట్ తనకిచ్చినా ఓకే.. లేదంటే జూనియర్‌‌కు ఇచ్చినా ఓకేనని చెప్పారట. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉందన్నది ఆ పెరుమాళ్లకే ఎరుక. మరోవైపు జూనియర్ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలుసుకున్న ఆయన ఆప్తుడు, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానితో సీటు విషయమై మాట్లాడారట.

టికెట్ కోసం భగీరథ ప్రయత్నాలు..
మరోవైపు టాలీవుడ్ మన్మథుడు, ప్రముఖ వ్యాపారవేత్త అక్కినేని నాగార్జున సైతం.. జగన్‌‌ను కలిశారు. కింగ్ కూడా రాజకీయాల్లోకి వస్తారని గత ఎన్నికల నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అప్పట్లో గుంటూరు ఎంపీగా కింగ్ సతీమణి అమల పోటీచేస్తారని టాక్ నడిచింది. అయితే చివరి నిమిషంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వేరొకరికి సీటు వెళ్లిపోయిందట. తాజాగా ఎన్నికల ముందు జగన్‌‌ను.. నాగార్జున కలవడంతో మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అయితే ఈసారి ఓ బడా నిర్మాతకు టికెట్ ఇప్పించేందుకు గాను ఆయన కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. భేటీ అనంతరం నాగ్ ఈ వార్తలన్నింటినీ ఖండించినప్పటికీ అసలు వ్యవహారం అదేనని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొత్తానికి చూస్తే.. జూనియర్ వైసీపీలోకి రాకపోవచ్చుగానీ వాళ్ల మామ మాత్రం కచ్చితంగా వస్తారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయనొస్తే ఎక్కడ్నుంచి బరిలోకి దిగుతారు..? గుంటూరు నుంచి బరిలోకి దిగుతారా లేకుంటే మరోచోట్నుంచి రంగంలోకి దిగుతారా..? మరోవైపు నాగార్జున కూడా మిత్రుడైన బడా నిర్మాతకు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో జగన్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు..? ఎవరికి రెడ్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే మరి.

11 COMMENTS

 1. Знаете ли вы?
  Во время немецкой оккупации Украины радио на украинском языке вещало из Саратова и Москвы.
  Преподаватель нескольких университетов, попавший в сталинские лагеря, и там умудрился обучать математике на куске мыла.
  Хотя ареал белизского геккона состоит из нескольких крохотных островов, IUCN не считает его раздробленным.
  Карьера не помешала фарерскому футболисту играть в гандбол, записать три музыкальных альбома, издать пять книг и сняться в восьми фильмах.
  Американская энциклопедия включила в себя десятки статей о вымышленных людях, якобы связанных с Латинской Америкой.

  http://www.0pb8hx.com/

 2. Знаете ли вы?
  Кустурица пропустил получение «Золотой ветви» в Каннах, так как любит друзей больше, чем церемонии награждения.
  Самцы косатки, обитающие в Британской Колумбии, всю жизнь живут с мамой.
  Ливийский диктатор пытался спасти от казни премьер-министра Пакистана.
  Китай реализует в Пакистане собственный План Маршалла.
  Новый вид пауков-скакунов был назван по имени писателя в честь юбилея его самой известной книги о гусенице.

  http://www.arbeca.net/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here