బాబును ఢిల్లీ నుంచి గల్లీకి లాగిన కేటీఆర్!

2
499

ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించిన అనంతరం ఫస్ట్ టైం మీడియాతో మాట్లాడిన ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడంతో పాటు మీడియా ప్రతినిధులు సంధించిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పనిచేస్తారా..? అనే నుంచి ప్రశ్న ఎదురవ్వగా ఆయన వ్యూహాత్మకంగా సమాధానమిచ్చారు.

కేటీఆర్ మాటల్లోనే.. ” చంద్రబాబు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఫ్రంట్‌ పేరుతో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు జాతీయ స్థాయి నేత కాదు. బీజేపీని బూచిగా చూపి టీడీపీని బలపర్చుకోవాలన్నదే చంద్రబాబు ప్రయత్నం. కేసీఆర్‌ ప్రయత్నం దేశం.. అర్థవంతమైన రాజకీయం కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌ వైపు ఉన్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి సంబంధంలేని ఫ్రంట్‌ మాది. జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం ప్రాంతీయ పార్టీలే. పార్టీలన్నింటినీ ఏకం చేస్తాము. ఏపీలో టీడీపీయే కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అక్కడి రాజకీయాలు అనూహ్యంగా మారతున్నాయి. ఏపీ రాజకీయాల్లో మా పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఏపీలో బలమైన ప్రాంతీయ పార్టీ గెలవాలి” కేటీఆర్ ఆకాంక్షించారు.

చంద్రబాబు జాతీయస్థాయి నేత కాదని కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. కేటీఆర్ మాటల ప్రకారం ఆయన ఢిల్లీ స్థాయి లీడర్ కాదంటే పరోక్షంగా గల్లీ ఢిల్లీ లీడరే అన్నమాట. అయితే ఒకప్పుడు చంద్రబాబు పాచికలు జాతీయస్థాయిలో పారాయేమోకానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని.. పైగా బాబును లెక్కచేసే వాళ్లు ఢిల్లీలో లేరని.. ఏదైనా పెద్దపెద్ద సంక్షోభాలు వచ్చినప్పుడు మాత్రమే ఫ్రెంట్ అని హడావుడి చేస్తుంటారని పలువురు విశ్లేషకులు, క్రిటిక్స్ అంటున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here