‘సీత’ సెన్సార్ పూర్తి…. మే 24న గ్రాండ్ రిలీజ్

bellam konda ‘seetha’ movie censor complete

0
517

యువ కథానాయకుడు బెల్లకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం `సీత`. తేజ దర్శకత్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. మే 24న సినిమా విడుద‌ల‌వుతుంది.గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను `మ‌హ‌ర్షి` సినిమాలో ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఈరోజు ట్రైల‌ర్‌ను ఆన్ లైన్‌లో విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల నుండి ట్రైల‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది.

“నా పేరు సీత నేను గీసిందే గీత‌, ప్రాస బావుంది క‌దూ! అంటూ కాజ‌ల్ అగ‌ర్వాల్ చెప్పే డైలాగ్‌
ఇది పెద్ద కంచులా ఉందిరా! బాబూ అని త‌నికెళ్ల భ‌ర‌ణి చెప్పే డైలాగ్‌ `రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు` అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్‌.. ట్రైల‌ర్‌లో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ డిఫ‌రెంట్ రోల్‌లో మెప్పించ‌నున్నారు. బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ ఈ చిత్రంలో నెగ‌టివ్ రోల్ చేస్తున్నారు. పాయ‌ల్ రాజ్‌పుత్ ఓ స్పెష‌ల్ సాంగ్ చేశారు. అనీల్ సుంక‌ర నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు. అనూప్ సంగీతంతో పాటు, బ్యాగ్రౌండ్ స్కోర్‌, శిర్షా రే సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు ఎసెట్‌గా నిల‌వ‌బోతున్నాయి.

న‌టీన‌టులు:
బెల్లంకొండ శ్రీనివాస్‌
కాజ‌ల్ అగ‌ర్వాల్‌
మ‌న్నారా చోప్రా
సోనూ సూద్‌
త‌నికెళ్ల భ‌ర‌ణి
అభిన‌వ్ గోమ‌టం
అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
ద‌ర్శక‌త్వం: తేజ‌
నిర్మాత‌: రామబ్ర‌హ్మం సుంక‌ర‌
బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఏ టీవీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కిషోర్ గరిక‌పాటి
కో ప్రొడ్యూస‌ర్స్‌: అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్‌: అనూప్ రూబెన్స్‌
సినిమాటోగ్ర‌పీ: శిర్షా రే
ఎడిట‌ర్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు
ఫైట్స్‌: క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌
డైలాగ్స్‌: ల‌క్ష్మీ భూపాల్‌
ప‌బ్లిసిటీ ఇన్‌చార్జ్‌: విశ్వ సి.ఎం
పి.ఆర్‌.ఒ: వంశీ శేఖ‌ర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here