సెన్సార్ లో క్లీన్ ‘U’ తో పాసైన ” boy “.

0
113

“విశ్వరాజ్ క్రియేషన్స్” బ్యానర్ పై అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “boy” సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక్క కట్ కూడా లేకుండా క్లీన్ ‘ U ‘ సర్టిఫికేట్ పొందడమే కాకుండా ఈ సినిమా సెన్సార్ బోర్డు నుంచి మంచి ప్రశంసలు కూడా అందుకుంది.
ఉగాది రోజు అన్నపూర్ణ స్టుడియోస్ లో “మహర్షి ” సినిమా సెట్ లో దర్శకుడు వంశీ పైడిపల్లి లాంచ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభిస్తోంది . వంశీ పైడిపల్లి మాట్లాడుతూ… హై స్కూల్ యూనిఫామ్ లో ఉన్న స్టూడెంట్, కాలేజ్ వైపు చూస్తూ ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తుంటే, డైరెక్టర్ అమర్ ఈ సినిమా లో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ సూచాయగా కనిపిస్తూ ఉంది. దర్శకుడు అమర్ కి మరియు “boy” చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. లక్ష్య, వినయ్ వర్మ, సాహితి. నీరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాని కి కెమెరా: అష్కర్, ఎడిటింగ్: ఏకలవ్యన్, సంగీతం: ఎల్విన్ జేమ్స్. సహ నిర్మాతలు: శశిధర్ కొండూరు, ప్రదీప్ మునగపాటి. నిర్మాతలు: ఆర్. రవిశేఖర్ రాజు, అమర్ విశ్వరాజ్ రచన, దర్శకత్వం: అమర్ విశ్వరాజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here