స్క్రూ డ్రైవర్‌ నుంచి ప్రతి పిన్‌ ఆయన సృష్టేనట

0
470

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతోన్న విజువల్‌ వండర్‌ ‘2.O’. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సుభాష్‌ కరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా ‘2.O’ టీమ్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ- ‘‘2.O చిత్రాన్ని నాతో ప్రసాద్‌గారు, యు.వి.క్రియేషన్స్‌ కలిసి విడుదల చేస్తున్నారు. రెండు రోజుల క్రితం విడుదలైన సాంగ్‌ ఈ సినిమాపై ఉన్న అంచనాల ఏంటో చెబుతుంది. వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఇండియన్‌ ఫిలిం లిస్ట్‌లో ‘2.O’ నిలవబోతుంది. ఎంటైర్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు.

ఎన్‌.వి.ఆర్ సినిమాస్ అధినేత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ- ‘‘నాలుగేళ్లు శంకర్‌గారు ఈ సినిమా కోసం కష్టపడ్డారు. స్క్రూ డ్రైవర్‌ నుండి ప్రతి పిన్‌ ఆయన నుండి వచ్చిన సృష్టి. లైకా ప్రొడక్షన్స్‌ సుభాష్‌ కరణ్‌ అంత గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇండియన్‌ సినిమాను వరల్డ్‌ సినిమా చేయడానికి రజనీకాంత్‌గారు.. సుభాష్‌కరణ్‌గారు.. శంకర్‌గారు.. అక్షయ్‌కుమార్‌గారు.. పడిన తాపత్రయం ఏంటో మేకింగ్‌లోనే తెలుస్తుంది. అసలు దీపావళి ఈ నెల 29న స్టార్ట్‌ అవుతుంది. ఈ దీపావళి సంక్రాంతి తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. మన ఇండియన్‌ సినిమా వరల్డ్‌ సినిమా అవడానికి వాళ్లు చేసిన కృషి అమోఘం, అద్భుతం. రియల్‌ త్రీడీలో ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది.

ఎన్నో సంవత్సరాలు, రాత్రుళ్లు అందరూ పడ్డ కష్టమీ చిత్రం. కేవలం సినిమా ప్రేక్షకులను మెప్పించాలి.. గొప్ప చిత్రం అందించాలని అందరూ కష్టపడ్డారు. కచ్చితంగా వారి కష్టానికి ప్రపంచ వ్యాప్తంగా ఓ గుర్తింపు వస్తుందని, వరల్డ్‌ సినిమాగా నిలబడుతుందనే నమ్మకం ఉంది. సినిమా మీద ప్రేమతో ఇలాంటి ప్రయత్నం చేసిన టీమ్‌కు అభినందనలు. శంకర్‌గారిని, రాజమౌళిగారిని, రాజ్‌కుమార్‌ హీరాణిగారిని మేం మరచిపోం. వారు మరిన్ని గొప్ప చిత్రాలను అందించాలని కోరుకుంటున్నాం’’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here