స్వదేశానికి వచ్చిన రియల్ హీరో ‘అభినందన్‌’

IAF wing commander abhinandan varthaman return from pakistan

0
697

ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభిందనన్ వర్థమాన్ భారత గడ్డపై అడుగుపెట్టారు. వాఘా-అటారీ సరిహద్దులో ఆయనకు ఎయిర్ ఫోర్స్ అధికారులు ఘనస్వాగతం పలికారు. మరోవైపు పాకిస్తాన్ గడ్డపై భారతదేశ పౌరుషాన్ని చూపిన ధీరుడిని కళ్లారా చూసేందుకు పౌరులు, అభిమానులు సైతం భారీగా తరలివచ్చారు. వందలాది మంద్రి ప్రజలు డ్రమ్స్ వాయిస్తూ అభినందన్ ఫోటోలతో, పూలదండలు, జాతీయ జెండాలతో రియల్‌ హీరోకు గ్రాండ్‌ వెల్‌కమ్ పలికారు. ‘జయహో అభినందన్’.. ‘జయహో వర్థమాన్’ అనే నినాదాలతో వాఘా సరిహద్దుల్లో నినాదాలు హోరెత్తాయి. ఈ క్రమంలో సరిహద్దుల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగింది.

సరిగ్గా 03:58 గంటలకు అభినందన్‌ ఇండియాలో అడుగుపెట్టారు. భారత రాయబారి గౌరవ్ అహ్లువాలియ అప్పగింత వ్యవహారాలు పూర్తి చేశారు. దగ్గరుండి అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్ జె.టి. క్రెయిన్‌‌ ఇండియాకు తీసుకొచ్చారు. వాఘా నుంచి దేశ రాజధాని ఢిల్లీకి అభినందన్ రానున్నారు. ఈ సందర్భంగా ఏమైనా నిఘా వస్తువులు, అనుమానాస్పద వస్తువులున్నాయా..? ఆయనపై ఏదైనా ప్రయోగం జరిగిందా..? ఆయన ఏదైనా ప్రభావంలో ఉన్నారా..? అని నిపుణుల సమక్షంలో నిశితంగా తనిఖీలు, పరీక్షలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా అభినందన్ దుస్తులు, వస్తువులను సేకరించి పరీక్షలు చేయనున్నారు. కాగా ఇప్పటికే వాఘాకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సంబంధించిన వైద్య నిపుణుల బృందం చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం అభినందన్‌‌తో అధికారులు చర్చలు జరపనున్నారు.

అభినందన్‌ని విడుచేయాలన్న పాకిస్తాన్ నిర్ణయాన్ని చైనా స్వాగతించింది. ఉగ్రవాద నిర్మూలనకు ఇరుదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఆకాంక్షించింది. శాంతి, సుస్థిరత ఇండియా-పాకిస్తాన్ కూర్చొని మాట్లాడుకోవాలని సూచించింది. చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చైనా అభిప్రాయపడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here