ప్రియాంక హత్య కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్.. పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

0
117

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోర్ట్ నిందితులకు 14రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్‌ స్టేషన్‌లోకి స్థానికులు విద్యార్థులు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట జరిగింది.

నిందితులను ఉరితీయాలని మహిళా సంఘాలు నిరసనలు చేస్తున్నారు. ప్రియాంక హత్యపై దేశ వ్యాప్తంగా పలు సినీ రాజకీయ ప్రముఖులందరూ నిరసన తెలుపుతున్నారు. విజయవాడలో సిద్దార్థ మహిళా కాలేజీ స్టూడెంట్స్ మరియు తిరుపతి కాలేజీ స్టూడెంట్స్ అందరూ నిందితుల తరపున ఏ లాయర్ వాదించకూడదని, వెంటనే ఆ దుర్మార్గులను ఉరి తీయాలని నిరసన చేపట్టారు.

నలుగురు లారీ డ్రైవర్లు క్లీనర్లు కలిసి ప్రియాంకపై అత్యాచారం జరపి శవాన్ని కాల్చేసారనే విషయం తెలిసిందే. కానీ విచారణ జరిపిన కొద్దీ వారి దుర్మార్గాలు బయటపడ్డాయి. మొదట ప్రియాంకకు బలవంతంగా మందు తాగించి ఆమె అచేతన స్థితిలో ఉండగా 45 నిమిషాల పాటు ఆమెపై నలుగురు అత్యాచారం జరిపి చిత్రహింసలు పెట్టారు. తర్వాత నోరు ముక్కు మూసి ఆమెని చంపి లారీలోకి ఎక్కించారు. చనిపోయిన శవాన్ని కూడా వదల్లేదు ఆ కామపిశాచులు. లారీలో కూడా ఆమె శవంపై కూడా అత్యాచారం జరిపారు. ఆ తర్వాత ఆమె శవాన్ని కాల్చేశారు.

అమ్మాయిలూ ఎక్కడికైనా నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లినపుడు మీకు అక్కడ ఆపద పొంచి ఉందని అనిపించినపుడు 100 నెంబర్ కి ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవలసిందిగా పోలీసులు తెలుపుతున్నారు. ఒకవేళ ఇది కుదరక పోయినా అమ్మాయిలందరూ వారి ఫోన్ లో ‘హాక్-ఐ’ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు వెళ్తున్న మార్గాన్ని అందులో ముందుగానే షేర్ చేయడం వల్ల.. ఒకవేళ మధ్యలో దారి మారినా కూడా ఆ సమాచారం పోలీసులకు చేరుతుంది. అమ్మాయిలూ.. దయచేసి ‘హాక్-ఐ’ యాప్ ని డౌన్లోడ్ చెసుకోండి.. మీ ప్రాణాలు కాపాడుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here