ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ‘సైరా’ 50 డేస్ సెలెబ్రేషన్స్..

0
330

మెగాస్టార్ చిరంజీవి డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం అక్టోబర్ 2 న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో చిరంజీవి నటనకు మంచి నటుడి అవార్డు కూడా లభించనుందని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ మూవీ రిలీజ్ అయి ఇన్ని రోజులవుతున్నా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సుదర్శన్ థియేటర్లో ఈ మూవీ ఇంకా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ 50 రోజులు పూర్తి చేసుకుని రికార్డు క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా నవంబర్ 20 న సాయంత్రం 8 గంటలకు ‘సైరా 50 డేస్ సెలెబ్రేషన్స్’ సుదర్శన్35 ఆర్టీసీ క్రాస్ రోడ్ లో జరగనున్నట్లు ప్రకటించారు.

ఈ చిత్రంలో నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించగా, అమిత్ త్రివేది సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here