బాలుడి కిడ్నాప్.. మూడు గంటల్లో ఛేదించిన పోలీసులు

0
229

మీర్ పేట్ టీఎస్సార్ కాలనీలో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడో కిడ్నాపర్. ఈ కిడ్నాప్ ఉదంతాన్ని మూడు గంటల్లోనే పోలీసులు ఛేదించడం ఒక విశేషం కాగా.. కిడ్నాపర్ మైనర్ కావడం మరో విశేషం. మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎస్సార్ కాలనీలో నివాసముంటున్న రాజు అనే వ్యక్తి ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.

రాజ్ కుమారుడు అర్జున్(7) ఆదివారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా అతనికి మాయ మాటలు చెప్పి మీర్ పేట్ నుంచి అల్మాస్ గూడకు కిడ్నాపర్ తీసుకెళ్లాడు. అక్కడి నుంచి రాజుకు ఫోన్ చేసి మీ కొడుకుని కిడ్నాప్ చేశామని మూడు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. భయబ్రాంతులకు గురైన రాజు మీర్ పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

వెంటనే స్పందించిన పోలీసులు కిడ్నాపర్ కాల్ డేటా ఆధారంగా కేసును మూడు గంటల్లో ఛేదించారు. అతడు అల్మాస్ గూడకు చెందిన వెంకటేష్ పేరుతో అడ్రస్ ఉండడంతో ఇంట్లోకి వెళ్ళి సోదాలు నిర్వహించారు. వెంకటేష్ కుమారుడు ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డాడని తెలుసుకున్నారు. డబ్బులు తీసుకు వచ్చామని చెప్పి చాకచక్యంగా పోలీసులు కిడ్నాపర్‌ను పట్టుకుని రాజు దంపతులకు అర్జున్‌ను అప్పగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here