హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సైరా సక్సెస్ పార్టీ…

0
187

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘సైరా’ నరసింహా రెడ్డి. ఈ చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై అక్టోబర్ 2 న రిలీజ్ అయి అత్యధిక వసూళ్లను రాబడుతోంది. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు.

సైరా మూవీ సక్సెస్ అయిన సందర్బంగా బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సైరా సక్సెస్ పార్టీ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పార్టీకి చిరంజీవి మరియు హోస్ట్ టి.సుబ్బిరామి రెడ్డి, టాలీవుడ్ సినీ ప్రముఖులను, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు. ఈ పార్టీకి వెంకటేష్, కృష్ణం రాజు, అల్లు అరవింద్, గంటా శ్రీనివాస రావు, మురళీ మోహన్, శ్యామ్ ప్ర్రసాద రెడ్డి తదితరులు విచ్చేసారు.

సైరాలో ‘లక్ష్మి’ పాత్రలో నటించినందుకు తమన్నాను ప్రశంసించారు. అంతేకాకుండా తన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసారు తమన్నా. దానితో పాటుగా ”సైరా టీం యొక్క ముగ్గురు దిగ్గజాలను ఒకే చోట చూడటం చాల సంతోషంగా ఉంది” అని పోస్ట్ చేసారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here