పాకిస్థాన్‌లో తెలుగోడి అరెస్ట్.. యువతిని వెదుక్కుంటూ వెళ్లాడా?

0
33

హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరును పాకిస్థాన్‌లో భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయి. ఆయనతో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన టెకీ దరీలాల్‌ అనే వ్యక్తిని కూడా భద్రతాధికారులు అరెస్ట్ చేశాయని పాకిస్థాన్‌ మీడియా పేర్కొంది. అయితే ఓ యువతిని వెదుక్కుంటూ పాక్‌కి వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌కు ఓ యువతి ఆన్‌లైన్‌లో పరిచయమైంది.

ఆ యువతిని వెదుక్కుంటూ ప్రశాంత్ గూగుల్ మ్యాప్‌ను ఉపయోగించుకుని పాక్ భూభాగంలోకి అడుగు పెట్టాడని సమాచారం. పాక్‌లోని బహావల్‌పూర్‌ వద్ద కొలిస్థాన్‌ ఎడారిలో వీరిని సోమవారం అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. వీరి వద్ద ఎలాంటి పాస్‌పోర్టు, వీసా లేవని గుర్తించినట్లు పాక్‌ మీడియా పేర్కొంది. ప్రశాంత్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో సైతం పాక్‌ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది. అయితే ప్రశాంత్, దరీలాల్ ఇద్దరూ ఆ దేశంలో ఉగ్రదాడులకు కుట్రపన్నారనే అభియోగాలు పాకిస్థాన్‌ మీడియాలో ప్రసారమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here