పరువు పోతుందని.. భర్తకు దగ్గరుండి పెళ్లి చేసిన భార్య

0
158

పరువు పోతుందని భావించిన ఆ ఇల్లాలు తన భర్తకు దగ్గరుండి పెళ్లి చేసిన ఘటన ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలోని మత్తిలి సమితిలో జరిగింది. మార్‌పల్లి గ్రామానికి చెందిన రామ కావసికి గాయత్రితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అంతా హాయిగా గడిచిపోతున్న వీరి జీవితంలోకి ఐత మడకామి అనే యువతి వచ్చింది. రామ కావసికి ఐతతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ క్రమంలో ఐత తనను వివాహం చేసుకోవాలని.. లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ రామ కావసిని బెదిరించింది. తనకు పెళ్లైందని.. కుదరదని రామ కావసి తెగేసి చెప్పాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఐత.. మత్తిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం రామ కావసి భార్య గాయత్రికి తెలిసింది. తన భర్త జైలు పాలైతే తన కుటుంబం వీధి పాలవుతుందని.. పరువు పోతుందని భావించింది. దీంతో తన భర్తతో ఐతకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంది. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని తన అత్తమామలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులందరితో మాట్లాడి వారిని ఒప్పించింది. మార్‌పల్లిలోని సిద్ధి ఈశ్వర్ మందిరంలో రామ కావసి, ఐతకు గాయత్రి వివాహం జరిపించింది. దీంతో రామ కావసిపై ఐత పెట్టిన కేసును కొట్టివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here