‘ఆవిరి’ ఫస్టులుక్ పోస్టర్ రిలీజ్..

0
149

విభిన్నకథా చిత్రాల దర్శకుడు రవిబాబు మరోమారు ప్రేక్షకులను భయపెట్టడానికి హారర్ థ్రిల్లర్ ‘ఆవిరి’ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తేనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది.

గతంలో ఆయన చేసిన సినిమాలు, టైటిల్స్, పోస్టర్స్ చాలా విచిత్రంగాను , విభిన్నంగాను ఎంతో ఆసక్తికరంగాను ఉన్నాయి. ‘అనసూయ’, ‘అవును’, ‘అమరావతి’, ‘అవును 2’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు రవిబాబు.

తాజాగా ‘ఆవిరి’ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో స్టవ్ పై వున్న కుక్కర్ నుంచి ఆవిరి వస్తుండగా, కుక్కర్ పై భాగాన్ని ఓపెన్ చేసుకుని అందులో నుంచి భయపెడుతూ రెండు కళ్లు కనిపించేలా ఈ పోస్టర్ ను డిజైన్ చేశారు. ‘ఆవిరి’ అనే టైటిల్ కి తగినట్టుగా వదిలిన ఈ ఫస్టులుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here