సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అంత్యక్రియలు..

5
400

సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్(34) ముంబై బాంద్రాలోని తన నివాసంలో ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. దగ్గరలో ఉన్న బంధువులంతా ఆదివారం రాత్రికి చేరుకోగా సుశాంత్ తండ్రి ఇతర కుటుంబ సభ్యులతో పాట్నా నుండి సోమవారం మధ్యాహ్నానికి చేరుకున్నారు.

ముంబైలో జూహులోని కూపర్ హాస్పిటల్ లో నిన్న రాత్రి సుశాంత్ బాడీ కి పోస్ట్ మార్టం పూర్తైన తర్వాత ఈరోజు (సోమవారం) సాయంత్రం విలే పార్లే శ్మశానవాటికలో వర్షం కురుస్తుండగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెడ్ బాడీకి అంత్యక్రియలు నిర్వహించారు.

బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ సుశాంత్ సింగ్ కు విచ్చేసి నివాళులు అర్పించారు. కో-స్టార్స్ శ్రద్ద కపూర్, క్రితి సనన్ డైరెక్టర్ ముఖేష్ చబ్రా, అభిషేక్ కపూర్, వివేక్ ఒబెరాయ్ మరియు ప్రొడ్యూసర్స్ దినేష్ విజన్, జాకీ భగ్నానీ.. సుశాంత్ సింగ్ అంత్యక్రియలకు విచ్చేసి చివరి వీడ్కోలు తెలిపారు.

సుశాంత్ సింగ్ నటించిన మూవీస్ హిట్ అయినప్పటికీ అతనికి అంతగా అవకాశాలు రాలేదు ఎందుకంటే అతనికి ఖాన్ అని కపూర్ అని ఏ బ్యాగ్రౌండ్ లేదు.. అందుకే ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఇండస్ట్రీలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

సుశాంత్ సింగ్ నటించిన చిత్రాలు: MS Dhoni: The Untold story, సొంచీరియా, కై పో చే, డిటెక్టివ్ భ్యోమకేష్ భక్షి..

ఒకప్పుడు మన టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ విదితమే కదా..

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here