భర్తతో కలిసి పక్కా ప్లాన్‌తో వ్యాపారవేత్తను ట్రాప్ చేసిన ఎయిర్‌హోస్టెస్

0
340

హైదరాబాద్: ఓ ఎయిర్‌హోస్టెస్.. తన భర్తతో కలిసి పక్కా ప్లాన్ చేసి.. ఓ వ్యాపారవేత్తను ట్రాప్ చేసింది. డబ్బు కోసం హనీట్రాప్ చేసి లక్షల్లో వసూలు చేసింది. మరో కోటి రూపాయలకు టెండర్ పెట్టడంతో పాటు వీరి ఆగడాలను సహించలేకపోయిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. కనిష్క అనే ఎయిర్ హోస్టెస్‌ తన భర్త విజయ్‌కుమార్‌తో కలిసి పక్కా ప్లాన్ చేసి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు వల వేసింది. అతనితో దాదాపు మూడు నెలలకు పైగా హోటళ్లు, రిసార్టులకు కలిసి తిరిగింది.

అయితే కనిష్కతో, వ్యాపారవేత్త సన్నిహితంగా ఉన్న సమయంలో విజయ్‌కుమార్ రహస్యంగా ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేశాడు. దంపతులిద్దరూ కలిసి పక్కా ప్లాన్‌తో స్పై ఆపరేషన్ చేశారు. ఈ నేపథ్యంలోనే కనిష్క మరో ప్లాన్ కూడా చేసింది. నెల రోజుల క్రితం శంషాబాద్ సమీపంలోని రిసార్ట్‌కు వ్యాపారవేత్తతో కలిసి వెళ్లి.. అక్కడ అతనికి మత్తుమందు ఇచ్చింది. వ్యాపారవేత్త మత్తులో ఉండగా.. కనిష్కను భర్త విజయ్ కుమార్ రక్తం వచ్చేట్లు కొట్టినట్టు, ఆమె ఒంటిపై స్వల్పగాయాలయ్యేట్లు చేసి.. ఆ గదిలో ఫర్నీచర్‌ను కూడా చిందర వందరగా చేశారు. వ్యాపారవేత్తకు మెలకువ వచ్చే సమయానికి తమ మధ్య ఉన్న సంబంధం భర్తకు తెలిసిపోయినట్టు అతను తనను హింసించినట్టు కనిష్క సీన్ క్రియేట్ చేసింది.

విజయ్‌కుమార్ కూడా సీన్‌లో జీవించేశాడు. తన భార్యతో సరసమాడతావా? అంటూ పిస్టల్ తీసి రెచ్చిపోయాడు. భయపడిపోయిన వ్యాపారి రూ.20 లక్షలు సమర్పించుకుని.. మరో రూ.కోటికి బాండ్ రాసిచ్చి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇంతటితో అయిపోయిందనుకున్న వ్యాపారవేత్తకు కనిష్క దంపతుల నుంచి డబ్బు కోసం బెదిరింపులు మరీ ఎక్కువైపోయాయి. విసిగిపోయిన వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల విచారణలో ఈ వ్యాపారవేత్తే కాకుండా.. మరికొందరు ఈ జంట వలలో పడినట్టు తెలిసింది. వారిలో ఒక ఎన్నారై కూడా ఉన్నట్టు సమాచారం. ఎన్నారై న్యూడ్ వీడియోలతో కనిష్క బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here