స్పెయిన్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్న అక్కినేని కుటుంబం…

0
173
అక్కినేని కుటుంబం

ఓహ్ బేబీ విజయం తర్వాత, సమంత అక్కినేని తన తదుపరి ప్రాజెక్ట్ “96” తెలుగు రీమేక్ చేయనున్నారు. గత నెలలో షూటింగ్ ప్రారంభించారు. ఈ సమయంలో ఆమె స్పెయిన్ లో తన విరామాన్ని ఆస్వాదిస్తోంది. స్పెయిన్ లోని ఇబిజా లో తన భర్త నాగ చైతన్యతో కలిసి సెలవులో ఉన్నందున సమంత తన జీవితంలో ఉత్తమ సమయాన్ని గడుపుతోంది.

సమంత తన భర్త నాగ చైతన్యతో
స్పెయిన్ లో సమంత

అక్కినేని కుటుంబం నాగార్జున 60వ పుట్టిన రోజును స్పెయిన్ లోని ఇబిజా లో జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో ఉన్నాయి. అంతేకాక సమంత అక్కడ గడిపిన క్షణాల్ని ఫోటోల ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది. ఆ ఫొటోల్లో సమంత చాల ఫ్యాషనబుల్ గా కనిపించింది. తన డిజైనర్, స్నేహితురాలైన శిల్ప రెడ్డి తో మరియు వారు బస చేసిన విల్లా యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.

 

సమంత తన డిజైనర్ శిల్ప రెడ్డి తో

ఒక వారం గడిపిన తర్వాత అక్కినేని కుటుంబం హైదరాబాద్ కు రానుంది. వచ్చాక సమంత “96” మూవీ చేయనుంది. నాగ చైతన్య, సాయి పల్లవి తో కలిసి నటించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here