ఈ సినిమాను అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు – ‘Ala Vaikunthapurramloo’

0
473

ఇటీవలే విడుదలైన ‘అల.. వైకుంఠపురములో..’ మూవీ పోస్టర్ లో ‘మీరు ఈ సినిమాను అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లో చూడలేరు’ అని ఉండటంతో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సినిమా రిలీజైన ఒక నెలలోనే అమెజాన్ లాంటి సంస్థలు కొత్త సినిమాలను ఆన్ లైన్ లో పెట్టేయడంతో థియేటర్లలో సినిమాను చుసే వారి సంఖ్య తగ్గిపోతోంది.

ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా నిర్మాతలకు మంచి ఆదాయం లభిస్తున్నా, మూవీ ఎక్జిబిటర్లు మాత్రం బాగా దెబ్బ తింటున్నారు. అయితే మొన్న ఏప్రిల్ నుంచి కొత్త సినిమాలు రిలీజైన 60 రోజుల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ లో వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు.

అయినా కూడా ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మొన్న రిలీజైన నాని మూవీ ‘గ్యాంగ్ లీడర్’ 27 రోజులకే అమెజాన్ లో రావడంతో అందరూ షాక్ అయ్యారు. అదే చిన్న బడ్జెట్ సినిమాల విషయం మరీ దారుణంగా ఉంది. సినిమా రిలీజైన 3 వారాలకే ఆన్ లైన్ లో వచ్చేస్తున్నాయి.

అందుకే ఇప్పుడు దీనికి పరిష్కార దిశగా సినిమారంగం వెళ్తోందనిపిస్తోంది. ఇప్పటినుండైనా నిబంధనలను సరిగా అమలు పరచగలిగితే థియేటర్లకు పూర్వ వైభవం రావడంతో పాటు మూవీ ఎక్జిబిటర్లు కూడా లాభం పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here