‘అల వైకుంఠపురములో’: ‘సామజవరగమన’ సాంగ్ ప్రీ టీజర్ చూసారా..?

1
499

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన ‘సామజవరగమన’ చార్ట్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

దీంతో ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయింది. తాజాగా ఈ సాంగ్ ప్రీ టీజర్ ను రిలీజ్ చేసారు చిత్రబృందం. ఇందులో ఈఫిల్ టవర్ వద్ద అల్లు అర్జున్ పూజాల మధ్య నడిచే లవ్ ట్రాక్ సాంగ్ ఇది. ఈ సాంగ్ ప్రోమోను డిసెంబర్ 31 న విడుదల చేయనున్నారు.

ఈ చిత్రంలో టబు, రాజేంద్ర ప్రసాద్, నవదీప్, రామ కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం విడుదల కానుంది.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here