‘అల.. వైకుంఠపురములో’ 30 రోజుల బాక్స్ ఆఫీస్ వసూళ్లు..

0
1774

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల.. వైకుంఠపురములో’ మూవీ జనవరి 12 న విడుదలై, 30 రోజులు పూర్తయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రం 30 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ. 158.48 కోట్ల షేర్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ. 128.38 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక ప్రాంతాల వారీగా చూస్తే..

‘అల.. వైకుంఠపురములో’ 30 రోజుల వసూళ్లు..
నిజాం: 44.17 కోట్లు
సీడెడ్: 18.19 కోట్లు
ఉత్తరాంధ్ర: 20.02 కోట్లు
గుంటూరు: 11.02 కోట్లు
ఈస్ట్ గోదావరి: 11.29 కోట్లు
వెస్ట్ గోదావరి: 8.85 కోట్లు
కృష్ణా: 10.65 కోట్లు
నెల్లూరు: 4.65 కోట్లు
AP&TS: 128.84 కోట్లు

కర్ణాటక: 9.18 కోట్లు
ROI: 2.61 కోట్లు
అమెరికా: 18.31 కోట్లు
వరల్డ్ వైడ్: 158.94 కోట్లు

 

ఈ చిత్రంలో సుశాంత్, నివేత పేతురేజ్, టబు, జయరాం, మురళి శర్మ, సచిన్ ఖేద్కర్, నవదీప్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గీత ఆర్ట్స్ మరియు హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై అల్లు అరవింద్ మరియు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here