నిజంగా వైకుంఠపురమే.. ‘అల.. వైకుంఠపురములో’ రివ్యూ

0
100

చిత్రం: అల.. వైకుంఠపురములో
నటీనటులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, టబు, జయరాం, సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజు, సముద్రఖని, బ్రహ్మానందం, సునీల్‌, రాజేంద్రప్రసాద్‌, బ్రహ్మాజీ, మురళీ శర్మ, సచిన్‌ ఖేడ్కర్‌, రోహిణి, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిషోర్‌, అజయ్‌, తనికెళ్ల భరణి తదితరులు.
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌
సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌
ఎడిటింగ్‌: నవీన్‌ నూలి
నిర్మాత: అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ
రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌
బ్యానర్‌: గీతాఆర్ట్స్‌, హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌
విడుదల తేదీ: 12-01-2020

బన్నీ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడా అనే తరుణం వచ్చేసింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ‘జులాయి’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ తర్వాత వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో’. బన్నీ, పూజా హెగ్డే కాంబోలో ‘డీజే’ తర్వాత వచ్చిన రెండవ చిత్రమిది. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..

కథ: రామచంద్ర(జయరాం) ఆఫీస్‌లో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు వాల్మీకి(మురళీశర్మ). ఇద్దరికీ ఒకేసారి ఆస్పత్రిలో పిల్లలు పుడతారు. అయితే రామచంద్ర బిడ్డ పురిటిలోనే చనిపోయాడని భావించి వాల్మీకి తనకు పుట్టిన కొడుకును తన యజమాని కొడుకు స్థానంలో ఒక నర్స్ సహాయంతో పెడతాడు. బిడ్డ చనిపోయాడనుకుని తీసుకెళ్తుండగా.. ఆ బిడ్డ బతుకుతాడు. అయితే తనలా పేదరికంలో తన కొడుకు బతకకూడదని బిడ్డని ఇవ్వనంటాడు నర్స్ తో. ఆమె ఇది తప్పంటూ.. వీరిద్దరి మధ్య జరిగిన పెనుగులాటలో నర్స్ మేడమీద నుండి కింద పడి కోమాలోకి వెళ్ళిపోతుంది. యజమాని కొడుకుని తీసుకెళ్లి బంకు అని పేరుపెట్టి.. ఒక మధ్యతరగతి వ్యక్తిలా అతడిని పెంచుతాడు. మరోవైపు వాల్మీకి కొడుకు రాజ్‌మనోహర్‌(సుశాంత్‌)గా రామచంద్ర దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. మరి అసలు నిజం ఎలా తెలిసింది? చివరకు అసలు తల్లిదండ్రులను కలుసుకున్నాడా? మధ్యలో అమూల్య(పూజాహెగ్డే)ఎలా పరిచయం అయింది? అప్పలనాయుడు(సముద్రఖని) ఎవరు? అతడితో బంటుకు ఉన్న శత్రుత్వం ఏంటి? తెలుసుకోవాలంటే.. ‘అల వైకుంఠపురములో..’ తెరపై చూడాల్సిందే!

వివరణ: ఇద్దరు పిల్లలను పుట్టగానే ధనవంతుడి పిల్లవాడు పేదవాడి ఇంట్లో పేదవాడి పిల్లవాడు ధనవంతుడి ఇంట్లో పెరిగినా ‘స్థానం మారినా స్థాయి మారదు’ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు త్రివిక్రమ్. కథ పాతదే అయినా చాలా కొత్తగా చూపించారు. మూవీ ఫస్ట్ హాఫ్ లో అల్లు అర్జున్ మురళి శర్మ ఇంట్లో పెరిగి పెద్దవాడవటం ‘ఓ మై గాడ్ డాడీ’ సాంగ్ తర్వాత ఆఫీస్ లో పూజ హెగ్డే ఎంట్రీతో తర్వాత వచ్చే కామెడీ ‘సామజవరగమన’ ‘బుట్టబొమ్మ’ సాంగ్స్ తో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగా ఆకట్టుకుంది. పూజ హెగ్డే ను తన కోడలిగా చేసుకోవాలనుకుంటాడు జయరాం. సుశాంత్ తో నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది.

మరోవైపు జయరాం కంపెనీ వాటా కావాలంటూ అప్పలనాయుడు సీన్‌లో ఎంటర్‌ అవడం.. అదే సమయంలో బన్నీ, పూజ వారి లవ్ గురించి జయరాంకు చెప్పడానికి వెళ్ళినపుడు జయరాంని కాపాడే సీన్స్.. హాస్పిటల్ కి తీసుకెళ్లాక అక్కడొక ట్విస్ట్.. బన్నీకి అసలు తల్లిదండ్రులెవరో తెలియడం దాంతో వైకుంఠపురములో ఉన్న సమస్యలను తీర్చడం కోసం అక్కడికి ఎంట్రీ ఇవ్వడం.. ఆఫీస్ లో అల్లు అర్జున్ పరిస్థితికి సూట్ అయ్యే సాంగ్స్ కి డాన్స్ వేయడం గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి ఎపిసోడ్ ని తలపిస్తుంది. క్లైమాక్స్ లో సచిన్‌ ఖేడ్కర్‌ ఇచ్చే ట్విస్ట్ అసలు ఎవ్వరూ ఊహించలేరు. ‘నేను గెలవడం కంటే, మీరు కలవడం ఇంపార్టెంట్‌’, ‘ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మానాన్న అనుకోవాలా..? అమ్మానాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా’ అనే డైలాగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి.

నటన, సాంకేతికత: ఫస్ట్ టైం బన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రంలో చాలా బాగా చేసారు. ప్రతి సీన్ లోను బన్నీ పంచ్ త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ హైలైట్‌గా నిలిచాయి. సాంగ్స్ బన్నీ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెకండ్ హాఫ్ లో ‘రాములో రాములా’ సాంగ్ లో బ్రహ్మానందం స్పెషల్ ఎంట్రీ.. క్లైమాక్స్ లో విలన్ సాంగ్ పాడుతుంటే బన్నీ ఫైటింగ్త.. సీరియస్ సీన్స్ లో కూడా కామెడీ వదల్లేదు. తమన్ సంగీతం ఈ మూవీకి హైలైట్ గా నిలిచింది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ మూవీలో అసలు విలన్ బన్నీని పెంచిన తండ్రి మురళి శర్మ అన్నట్లుగా మురళి ఆయన మ్యానరిజం అందరినీ ఆకట్టుకుంటుంది. పూజ హెగ్డే కూడా చాలా బాగా చేసారు. ఫైటింగ్ సీన్స్ లోను చున్నీతో ఫైటింగ్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంది. అందరూ ఎవరు పాత్రలో వారు చాలా బాగా చేసారు.

ప్లస్ పాయింట్స్:
అల్లు అర్జున్
సాంగ్స్
కామెడీ
యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు

రివ్యూ: నిజంగా వైకుంఠపురమే..

రేటింగ్: 3.5/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here