నాకు న్యాయం చెప్పడానికేంటి సర్ ఇన్ని సంవత్సరాలు పడుతోంది: అల్లరి నరేష్

4
187

అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నాంది’. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేడు జూన్ 30 అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్బంగా.. ఆయన నటిస్తున్న క్రైమ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘నాంది’ మూవీ టీజర్ ఈరోజు ఉదయం విడుదల చేసారు.

ఇందులో ‘ఒక మనిషి పుట్టడానికి కూడా 9 నెలలే టైం పడుతుంది.. నాకు న్యాయం చెప్పడానికేంటి సర్ ఇన్ని సంవత్సరాలు పడుతోంది’ అనే డైలాగ్ హైలైట్. ఈ చిత్రంలో అల్లరి నరేష్ న్యూడ్ గా కనిపించడంతో అందరూ షాకయ్యారు.

 

ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. అంతేకాకుండా అల్లరి నరేష్ మరో మూవీలో కూడా నటిస్తున్నారు. కామెడీ ఫిల్మ్ ‘బంగారు బుల్లోడు’ మూవీ టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నారు.

 

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here