Allu Aravind ఆస్తిని, బాధ్యతలను పంచుకున్న కొడుకులు…

0
135

ఒకప్పుడు వరుస సినిమాలకు నిర్మాతగా బిజీ అయిన అల్లు అరవింద్ ఈ మధ్య తన కొడుకుల సినిమాలకే పరిమితమయ్యారు. ఇటీవలే ఆయన 70 వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన తన ముగ్గురు కొడుకులకి ఆస్తులు పంచారని ప్రచారం జరుగుతోంది.

ఇన్నాళ్లు తెరపైకి రాని అల్లు అరవింద్ పెద్ద కొడుకు వెంకటేష్ ఇప్పుడు అల్లు అరవింద్ ప్రజెంట్స్ పేరుతో వరుణ్ తేజ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ కొత్త ఇంటికి ముహూర్తం పెట్టడం, ఒక సొంత నిర్మాణ సంస్థను కూడా పెట్టబోతున్నారని సమాచారం.

ఇవన్నీ చూస్తుంటే అల్లు అరవింద్ తన బాధ్యతలను, ఆస్తిని తన కొడుకులకి అప్పగించి తాను రెస్ట్ తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఏదేమైనా ఇప్పుడు అల్లు అరవింద్ ఆస్తి పంపకాలు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here