‘ఈఫిల్‌ టవర్‌కి ‘సామజవరగమన..’ పాట ఏ మాత్రం తీసిపోదు’ – పూజ హెగ్దే

0
28

అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ మూవీపై భారీ అంచనాలున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ‘సామజవరగమనా’ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది.

ఇటీవలే ఈ సాంగ్ ను పారిస్ లోని చాలా అందమైన ప్రదేశాల్లో షూట్ చేసారు. అక్కడి లిడో డ్యాన్సర్ల నేప‌థ్యంలో షూట్ జరిగిందట. ఈ డ్యాన్స్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. వాళ్లతో కలిసి ఆడిపాడిన తొలి సౌత్ స్టార్‌ బన్నీ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ పాట గురించి పూజా హెగ్దే సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ చేశారు.

ఈఫిల్‌ టవర్‌ వద్ద బన్నీతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ.. ఈఫిల్‌ టవర్‌కి ‘సామజవరగమన..’ పాట ఏ మాత్రం తీసిపోదని ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here