అల్లు అర్జున్ ”అల…వైకుంఠపురములో…” యాక్షన్ పోస్టర్ రిలీజ్…

0
164

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి తర్వాత తెరకెక్కుతున్న మూడవ చిత్రం “అల…వైకుంఠపురములో…”. గతంలో విడుదలైన ‘సామజవరగమనా’ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇప్పుడు తాజాగ దసరాకు కానుకగా ఈ చిత్రం కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ క్లాస్ స్టైల్ లో, యాక్షన్ లుక్ తో అందరిని ఆకట్టుకునే విధంగా ఉన్నాడు. అల్లు అర్జున్ ఫుల్ ఫైటింగ్ మూడ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజాహెగ్డే నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది రెండవ చిత్రం. ఈ సినిమాకి ఎస్ ఎస్.తమన్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. 2020 సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here