TSRTC: మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య.. పరిస్థితి ఉద్రిక్తం

11
268

శ్రీనివాసరెడ్డి మరణవార్త తెలిసిన కొద్దిసేపటికే మరో ఆర్టీసీ ఉద్యోగి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ రాణిగంజ్‌ డిపోకు చెందిన కండక్టర్‌ సురేందర్‌ గౌడ్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం నుంచి తొలగించారని సీఎం కేసీఆర్ చెప్పడంతో సురేందర్ గౌడ్ చాలా కలత చెందారని.. ఇక తమ పరిస్థితి ఎలా అని ఆందోళనకు గురయ్యారని సురేందర్ గౌడ్ భార్య వెల్లడించారు.

శ్రీనివాసరెడ్డి మరణ వార్త తెలిసిన అనంతరం సురేందర్ గౌడ్ చాలా మనోవేదనకు గురయ్యారని ఈ నేపథ్యంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆమె తెలిపారు. సురేందర్ గౌడ్‌కు సెప్టెంబరు నెల జీతం రాకపోవడంతో పాటు.. బిడ్డ పెళ్లికి తీసుకున్న రుణానికి ఈనెల చెల్లించాల్సిన ఈఎంఐ కూడా బౌన్స్‌ కావడం ఆయన ఆత్మహత్యకు మరో కారణంగా తెలుస్తోంది. అలాగే నర్సంపేటలో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మాహుతి యత్నం చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అగ్గి మీద గుగ్గిల మవుతున్నారు.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here