అనుష్క ‘నిశ్శబ్దం’ మూవీ విడుదల వాయిదా..!

0
85

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నిశ్శబ్దం’. మాధవన్ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ చిత్రం జనవరి 31 న విడుదల కావాల్సి ఉంది కానీ ప్రమోషన్స్ ఇంకా ప్రారంభం కానందున మూవీ విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు ఈ వార్తలను నిజం చేస్తూ.. చిత్రబృందం కొత్త విడుదల తేదీని ఖరారు చేసిందని.. ఫిబ్రవరి 20 న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ అంజలి షాలిని పాండే ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here