భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్న ‘అర్జున్ సురవరం’..

0
132

నిఖిల్ సిద్దార్థ్, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా టి. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్జున్ సురవరం’. ఈ చిత్రం నవంబర్ 29 న విడుదల కాగా ఫస్ట్ షో నుండే ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ ని రాబడుతోంది.

ఈ చిత్రం మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ.4.1 కోట్ల గ్రాస్ ని వసూలు చేయగా, సినిమా విడుదలైన 3రోజుల్లో రూ.12.3 కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో, మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై, టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో, రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here