‘అర్జున్ సురవరం’ మూవీ రివ్యూ..

0
185

చిత్రం: అర్జున్‌ సురవరం
న‌టీన‌టులు: నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్, త‌దిత‌రులు.
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: టి.సంతోష్‌
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల
సంగీతం: సామ్ సి.ఎస్
సినిమాటోగ్రఫీ: సూర్య మిశ్రా
స‌మ‌ర్పణ‌: ఠాగూర్ మ‌ధు.
సంస్థ‌: మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి
విడుద‌ల‌ తేదీ: 29-11-2019

నిఖిల్ లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టించిన చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈరోజు న‌వంబ‌ర్ 29 ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. అయితే ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ: అర్జున్ సురవరం (నిఖిల్) టీవీ 99 ఛానల్ లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. అతనితో పాటు పనిచేస్తున్న అమ్మాయిని (లావణ్య) లవ్ చేస్తాడు. ఎప్పటికైనా బీబీసీలో ఉద్యోగం సంపాదించాల‌నేది అతడి క‌ల‌. అందుకోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే క్రమంలో ఫేక్ సర్టిఫికెట్స్ స్కామ్ లో పోలీసులు అరెస్ట్ చేస్తారు. తర్వాత బెయిల్ మీద బయటకు వస్తాడు. తాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కనుక ఈ స్కామ్ వెనక ఎవరున్నారని తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెడతాడు. ఈ స్కామ్ వెనక పెద్ద మాఫియా ఉందని తెలుసుకుని షాక్ అవుతాడు. తర్వాత అర్జున్ ఈ స్కామ్ నుండి ఎలా బయటపడతాడు? ఈ క్రమంలో తనకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొంటాడు..? అనేది కథాంశం.

వివరణ: ప్రతి క్షణం ఉత్కంఠగా సాగే విధంగా దర్శకుడు చాల చక్కగా తెరకెక్కించారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా అర్జున్ చేసే స్టింగ్ ఆపరేషన్స్ తో కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని స‌న్నివేశాలు రిపీట్ అయినట్లు అనిపించినా.. మాఫియా ఫేక్ సర్టిఫికెట్స్ ని ఏవిధంగా తయారు చేస్తారో.. వాటిని ఏవిధంగా సర్క్యూలేట్ చేస్తారో చాల బాగా చూపించారు. స్కూలు కూలిపోయే స‌న్నివేశాల్ని చాలా బాగా చిత్రీకరించారు.

నటీనటులు: ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ యాక్టింగ్ చాలా చక్కగా చేసారు. యాక్షన్ స‌న్నివేశాలు కూడా చాలా బాగా చేశాడు. కావ్య పాత్రలో లావ‌ణ్య త్రిపాఠి చాలా చక్కగా న‌టించింది. వెన్నెల కిషోర్‌ కామెడీ సన్నివేశాల్లో మాత్రమే కాకుండా ఎమోషనల్ సీన్స్ లో కూడా చాల బాగా నటించారు. తండ్రి పాత్రలో నాగినీడు, పోలీస్ గా పోసాని కృష్ణమురళి వారి పాత్రలకు న్యాయం చేసారు. సూర్య కెమెరా పనితనం మరియు సామ్‌.సి.ఎస్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచాయి. ఫస్ట్ హాఫ్ లో థ్రిల్ ఎలిమెంట్స్ చాలా గ్రిప్పింగ్ గా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో ఆ గ్రిప్పింగ్ మిస్ అయినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్:
కథ
కథనం
మలుపులు
కామెడీ
బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్:
ఫస్ట్ హాఫ్ లో ఉన్న గ్రిప్పింగ్ సెకండ్ హాఫ్ లో మిస్ అయినట్లు అనిపించింది. అంతేకాకుండా కొన్ని లాజిక్స్ మిస్ అయ్యారు.

ఏదేమైనా సినిమా మాత్రం ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here