ఏంది ముద్దు పెడితే ఏడుస్తరాబ్బ: సాయి పల్లవి

0
138

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా ‘లవ్ స్టోరీ’. ఈ చిత్రంలో చైతూ తెలంగాణ కుర్రాడిగా.. తెలంగాణ భాషలో మాట్లాడటం కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. సాయి పల్లవి ఈ చిత్రంలో డాన్సర్ గా కనిపించనుంది.

తాజాగా ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ ‘ఏ పిల్లా’ సాంగ్ ప్రివ్యూను ఫిబ్రవరి 14 న ప్రేమికుల రోజు సందర్బంగా విడుదల చేసారు. ‘ఏ పిల్లా పరుగున పోదామ.. ఏ వైపో జంటగా ఉందామ..’ అంటూ మెలోడియస్ గా సాగే ఈ సాంగ్ కు చైతన్య పింగళి లిరిక్స్ ని అందించగా హరిచరణ్ పాడారు.

చివరిలో సాయి పల్లవి ముద్దు పెడితే చైతూ కంట తడి పెడితే.. ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తరాబ్బ’ అనే పల్లవి డైలాగ్ హైలైట్ సీన్.. పవన్ స్వరపరిచిన ఈ మెలోడియస్ సాంగ్ తో మూవీపై మంచి హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here