లండన్ లో ‘Bahubali’ టీం: పంచె కట్టులో Rajamouli, బ్లాక్ శారీలో మెరిసిపోతున్న Anushka Shetty

0
224

ప్రస్తుతం రాజమౌళి RRR మూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ స్టేడియం లో ప్రదర్శించబోతున్న ‘బాహుబలి’ సినిమా కోసం వెళ్లారు. ఆయనతో పాటు ప్రభాస్, రాణా, అనుష్క కూడా వెళ్లారనే విషయం మనకు తెలిసిందే.

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన ప్రతిష్టాత్మక చిత్రం ”బాహుబలి”. లండన్ లో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అక్టోబర్ 19 సాయంత్రం 7 గంటలకు ”బాహుబలి: ది బిగినింగ్” మూవీని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్, రాణా, అనుష్క మరియు సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్.కీరవాణి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి వచ్చిన బాహుబలి టీమ్ కి ఘన స్వాగతం లభించింది. వారు హాల్ లోకి వస్తుండగా అక్కడి అభిమానులు వారితో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు.

ఈ కార్యక్రమానికి రాజమౌళి తెలుగు సాంప్రదాయ పంచె కట్టుతో రావడం విశేషం. అంతేకాకుండా బాహుబలి భామ అనుష్క శెట్టి బ్లాక్ చీరలో మెరిసిపోయింది.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్ర ప్రదర్శన అద్భుతంగా జరిగింది. ఈ సందర్బంగా రాజమౌళి ”ఈ కార్యక్రమం ద్వారా బాహుబలి టీం మళ్లీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కలిగించినందుకు లండన్ కి కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఈవెంట్ ని ఎన్నటికీ మర్చిపోలేను.” అని ట్విట్టర్ లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here